Punjab Kings: పోరాడి ఓడిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
- By Gopichand Published Date - 12:12 AM, Wed - 26 March 25

Punjab Kings: ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది. మొదట ఆడిన పంజాబ్ 243 పరుగులు చేయగా, గుజరాత్ 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తరఫున కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు, శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు సాధించారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లకు 243 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో ఐదు ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ అరంగేట్రం ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, శశాంక్ సింగ్ చివరి ఓవర్లలో 16 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి జట్టు స్కోరును పటిష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి కిషోర్ సమర్థవంతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 74 పరుగులు చేశాడు. అతడితో పాటు బట్లర్ 54 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read: Hardik Pandya: అందుబాటులో పాండ్యా.. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు!
పంజాబ్ చారిత్రాత్మక విజయం
పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు 20 ఓవర్లలో 232 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున విజయ్ కుమార్ వైశక్ ఓడిపోయిన ఆటను తన జట్టు విజయంగా మార్చుకున్నాడు. పంజాబ్ తరఫున కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 97 పరుగులు, శశాంక్ అజేయంగా 44 పరుగులు సాధించారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 74, జోట్ బట్లర్ 54 పరుగులు చేసినప్పటికీ గుజరాత్ ఓటమి నుంచి బయటపడలేకపోయింది.