HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gautam Gambhirs Future As Test Coach In Doubt

టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్‌?!

మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్స్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్‌కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది.

  • Author : Gopi Date : 28-12-2025 - 2:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gautam Gambhir
Gautam Gambhir

Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగుతోంది. వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో గంభీర్ నాయకత్వంలో జట్టు ఆకట్టుకున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం టీమ్ ఇండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బీసీసీఐ కొత్త టెస్ట్ కోచ్ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

గంభీర్ భవిష్యత్తుపై సందిగ్ధత

గౌతమ్ గంభీర్ 2027 వరకు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఒప్పందం కలిగి ఉన్నారు. అయితే టెస్ట్ క్రికెట్‌లో జట్టును నడిపించడానికి గంభీర్ సరైన వ్యక్తి అవునా కాదా అనే సందేహం బీసీసీఐలో మొదలైందని పిటిఐ (PTI) నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికా పర్యటనలో వైఫల్యం తర్వాత టెస్ట్ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టాల్సిందిగా బోర్డు మరోసారి వీవీఎస్ లక్ష్మణ్‌ను అనధికారికంగా సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also Read: మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

గతంలో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసినప్పుడు కూడా లక్ష్మణ్ పేరు వినిపించింది. అయితే లక్ష్మణ్ ఈ ప్రతిపాదనను మళ్ళీ తిరస్కరించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ‘హెడ్ ఆఫ్ క్రికెట్’గా కొనసాగడానికే మొగ్గు చూపుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్‌కు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ దయనీయ స్థితి

మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్స్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్‌కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది. ప్రస్తుతం 2025-27 WTC సైకిల్‌లో కూడా టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. భారత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. పాయింట్ల శాతం (PCT) పరంగా చూస్తే ఇతర జట్లు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket news
  • gautam gambhir
  • sports news
  • team india
  • VVS laxman

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd