IPL 2024 Opening Ceremony: స్టార్స్ తో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ… వేడుకల్లో పెర్ఫార్మ్ చేసేది ఎవరంటే ?
వరల్డ్ క్రికెట్ లో క్రేజీయెస్ట్ లీగ్ ఐపీఎల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు బ్రాండింగ్ లోనూ, క్వాలిటీలోనూ, వ్యూయర్ షిప్ లోనూ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా మరే లీగ్ లేదు.
- Author : Praveen Aluthuru
Date : 20-03-2024 - 5:05 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2024 Opening Ceremony: వరల్డ్ క్రికెట్ లో క్రేజీయెస్ట్ లీగ్ ఐపీఎల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మోస్ట్ పాపులర్ మాత్రమే కాదు బ్రాండింగ్ లోనూ, క్వాలిటీలోనూ, వ్యూయర్ షిప్ లోనూ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా మరే లీగ్ లేదు. ఇలాంటి లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ 17వ సీజన్ కు మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్ లోనే టాప్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కంటే ముందు భారీ ఓపెనింగ్ సెర్మనీ కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఆరంభ వేడుకల్లో ఎప్పటిలానే పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు.
బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ వేడుకల్లో ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అలరించనున్నాడు. రెహమాన్ తో పాటు సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ పెర్ఫార్మ్ చేయనున్నారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్ కు వీరంతా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆరంభ వేడుకలు అరగంట సేపు ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేసినట్టు సమాచారం. గత ఏడాది కూడా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ సెర్మనీలో పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. కాగా ఆరంభ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నైకి చేరుకున్న సీఎస్కే, బెంగళూరు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి.
Also Read: Smantha-Tamannah: తమన్నా ఆమె ప్రియుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత.. ఫ్రెండ్షిప్ గోల్స్ అంటూ?