KKR vs LSG: గంభీర్ కు కోహ్లీ ఫ్యాన్స్ సెగ.. వైరల్ వీడియో
ఐపీఎల్- 16 లీగ్ దశ పోటీలు ముగుస్తున్న వేళ మరో ఆసక్తికర ముగింపు చోటుచేసుకుంది. కోల్ కత్తా - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్
- By Praveen Aluthuru Published Date - 12:56 PM, Sun - 21 May 23

KKR vs LSG: ఐపీఎల్- 16 లీగ్ దశ పోటీలు ముగుస్తున్న వేళ మరో ఆసక్తికర ముగింపు చోటుచేసుకుంది. కోల్ కత్తా – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ మెరుపులు మెరిపించినా లక్నో విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. మే 20న జరిగిన ఈ ఆసక్తికర పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 1 పరుగు తేడాతో కోల్ కత్తాని ఓడించి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ అనంతరం గంభీర్ కు మరోసారి కోహ్లీ సెగ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్‌ని చూసిన అభిమానులు కోహ్లీ-కోహ్లీ నినాదాలు చేయడం, ఆపై గంభీర్ ఒకరకమైన రియాక్షన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతున్నప్పుడు, స్టాండ్‌లో కూర్చున్న అభిమానులు గంభీర్‌ని చూసి కోహ్లి-కోహ్లీ అని గట్టిగా నినాదాలు చేశారు. విరాట్ పేరు వినగానే గంభీర్ గంభీరమైన చేతులతో సైగ చేస్తాడు. ప్రస్తుతం ఈ సన్నివేశం ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ ఫాన్స్ వీడియోని వైరల్ గా మార్చారు. కోహ్లీతో పెట్టుకుంటే అట్లుంటది అంటూ టాగ్ లైన్ జోడిస్తున్నారు.
ఐపిఎల్‌లో ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో మెంటార్ గౌతమ్ గంభీర్ మరియు విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి లక్నోలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా మెంటర్ గంభీర్, ఆటగాడు నవీన్‌లను చూసి అభిమానులు కోహ్లీ-కోహ్లీ అంటూ స్లెడ్జ్ చేస్తున్నారు.
https://twitter.com/katyxkohli17/status/1660127143509237761?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1660127143509237761%7Ctwgr%5Ebab38b8288e9bd3bed56e8bb35e4ca8426215efa%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fcricket%2Fipl-gautam-gambhir-reaction-goes-viral-when-fans-chants-kohli-kohli-during-kkr-vs-lsg-watch-viral-video-ipl2023-23418770.html
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. కాగా ఇప్పటికే లక్నో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే ఆర్సీబీ ముంబైపై విజయం సాధిస్తే లక్నో, ఆర్సీబీ మరోసారి తలపడనున్నాయి. దీంతో కోహ్లీ, గంభీర్ మరోసారి ఎదురుపడటం చూడొచ్చు. ఫాన్స్ కూడా కోహ్లీ, గంభీర్ మరో మీటింగ్ పై ఆసక్తిగా ఉన్నారు.