HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Everything Is Ready For The T20 World Cup

T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం

  • Author : Vamsi Chowdary Korata Date : 02-02-2026 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup 2026
T20 World Cup 2026

T20 World Cup 2026  భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ 20 వరల్డ్ కప్ 2026 కోసం జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ గ్రూప్ – ఏలో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తొలి మ్యాచ్ అమెరికాతో ఆడనుంది. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌పై మాత్రం ఇంకా గందరగోళం నెలకొంది.

భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం జట్లు క్రమంగా తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. భారత్‌లో ఐదు వేదికలు, శ్రీలంకలో మూడు స్టేడియాల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్, ముంబైలో అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌పై మాత్రం గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ జట్టు తన మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించాయి.

గ్రూప్ ఏ జట్లు

గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రింకూ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘా నాయకత్వం వహించనుండగా, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షడాబ్ ఖాన్ ప్రధాన బలంగా నిలవనున్నారు.

గ్రూప్ బీ పరిస్థితి

గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, స్టోయినిస్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంక మాత్రం ఇంకా తుది జట్టును ప్రకటించలేదు.

గ్రూప్ సీ జట్లు

గ్రూప్ సీలో ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఇంగ్లండ్‌కు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా ఉన్నాడు. బట్లర్, ఆర్చర్, సామ్ కరన్ లాంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. వెస్ట్ ఇండీస్ కూడా బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో టోర్నీలో పోటీ ఇవ్వనుంది.

గ్రూప్ డీ పోటీ

గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాకు ఐడెన్ మార్కరమ్ నాయకత్వం వహిస్తుండగా, రబాడా, డికాక్, మిల్లర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. న్యూజిలాండ్‌కు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నాడు.

భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

అమెరికా జట్టు

మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహాంగీర్, సైటేజ ముక్కమాల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రవాల్కర్, అలీ ఖాన్, మొహమ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.

నమీబియా జట్టు

గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్జ్, రూబెన్ ట్రంపెల్‌మన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలాన్ క్రూగర్, నికోల్ లోఫ్టీ-ఈటన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, జేసీ బాల్ట్, డిలన్ లీచర్, డబ్ల్యూపీ మైబర్గ్, మ్యాక్స్ హైన్గో.

నెదర్లాండ్స్ జట్టు

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కాలిన్ అకర్మన్, నోవా క్రోస్, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైకేల్ లెవిట్, జాక్ లయన్-క్యాషెట్, మ్యాక్స్ ఓ’డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, రూలఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, సకీబ్ జుల్ఫికార్.

పాకిస్తాన్ జట్టు

సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అశ్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫే, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.

ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.

శ్రీలంక జట్టు: స్క్వాడ్ ఇంకా ప్రకటించలేదు

జింబాబ్వే జట్టు

సికందర్ రజా (కెప్టెన్), బ్రయాన్ బెన్నెట్, రయాన్ బర్ల్, గ్రేమ్ క్రేమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తాడివానాషే మారుమాని, వెల్లింగ్టన్ మసకడ్జా, టోనీ మున్యోంగా, తాషింగా మ్యూసికివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియోన్ మైర్స్, రిచర్డ్ న్గరవా, బ్రెండన్ టేలర్.

ఐర్లాండ్ జట్టు

పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ క్యాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బ్యారీ మెకార్థీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

ఒమన్ జట్టు

జతిందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వాసిమ్ అలీ, కరణ్ సోనావలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఒడెడ్రా, షఫీఖ్ జాన్, ఆశిష్ ఒడెడారా, జితెన్ రామానంది, ఆమిర్ కలీం.

ఇంగ్లండ్ జట్టు

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, లూక్ వుడ్.

వెస్టిండీస్ జట్టు

షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, జాన్సన్ చార్ల్స్, రోస్టన్ చేస్, మ్యాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోటీ, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, క్వింటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.

టలీ జట్టు

వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ క్యాంపోపియానో, జియన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటీ, ఆంథనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నక్వీ, బెంజమిన్ మానెంటీ, జస్ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.

నేపాల్ జట్టు

రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కుషల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సుందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బాసిర్ అహ్మద్, సోంపాల్ కామి, కరణ్ కే.సి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజబంషీ, షేర్ మల్ల, లోకేశ్ బామ్.

స్కాట్లాండ్ జట్టు

రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మ్యాథ్యూ క్రాస్, బ్రాడ్లీ కర్రీ, ఒలివర్ డేవిడ్‌సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్‌క్, ఫిన్లే మెక్‌క్రిత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సీ, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.

దక్షిణాఫ్రికా జట్టు

ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బోష్, దేవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డీకాక్, మార్కో జాన్సన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడీ, అన్రిచ్ నోర్కియా, కగిసో రబడా, రయాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్.

న్యూజిలాండ్ జట్టు

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీసమ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ సైఫర్ట్, ఇష్ సోడి.

అప్ఘనిస్తాన్ జట్టు

రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జై, సెడికుల్లా అతల్, ఫజల్ హక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మొహమ్మద్ ఇషాక్ రహిమి, షాహిదుల్లా కమాల్, మొహమ్మద్ నబీ, గుల్బదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దర్విష్ రసూలీ, ఇబ్రాహీం జద్రాన్.

కెనడా జట్టు

దిల్‌ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుండాల్, అన్ష్ పటేల్, డిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరణ్‌దీప్ బుట్టర్, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్‌గూర్, నవనీత్ ధలివాల్, నికోలస్ కిర్టన్, రవీంద్రపాల్ సింగ్, సాద్ బిన్ జఫర్, శివమ్ శర్మ, శ్రేయస్ మొవ్వా, యువరాజ్ సమ్రా.

యూఏఈ జట్టు

ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరఫు, ఆర్యాంశ్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.

T20 World Cup 2026.

T20 World Cup 2026.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • cricket news India
  • ICC Cricket News
  • ICC T20 World Cup 2026
  • India Full Schedule
  • Indian cricket news
  • Sports UpdatesCricket News
  • T20 World Cup 2026
  • Team Squads List
  • TeamIndia
  • World Cup 2026

Related News

IND vs PAK

టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

పాకిస్తాన్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ 2026లో పాల్గొంటుంది.

  • Suryakumar Yadav

    విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Virat Kohli

    విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • IND vs NZ

    భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • IND vs PAK

    భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

Latest News

  • బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్

  • పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • వైరల్ : మహిళా కానిస్టేబుల్ చేసిన సాహసానికి ఫిదా అవ్వాల్సిందే !!

  • వైరల్ : బస్సుల్లోనే కాదు రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు

  • శంబాలా కు ఓటీటీలో భారీ ఆదరణ.. 11 రోజుల్లోనే సరికొత్త రికార్డు!

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd