England vs India : పేస్ ఎటాక్‌తో ఇంగ్లండ్ రెడీ.. మూడో టెస్టుకు తుది జట్టు ఇదే
England vs India : రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
- By Pasha Published Date - 06:36 PM, Wed - 14 February 24

England vs India : రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం తుదిజట్టులో ఇంగ్లండ్(England vs India) కీలక మార్పులు చేసింది. రాజ్ కోట్ పిచ్ పై పేస్ ఎటాక్ తో బరిలోకి దిగుతోంది. మూడో టెస్టుకు ఇద్దరు పేసర్లు అండర్సన్, మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చారు. తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే ఆడింది. ఉప్పల్ టెస్టులో మార్క్ వుడ్‌ను, వైజాగ్ టెస్టులో అండర్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే మూడో టెస్టు తుదిజట్టులో షోయబ్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్ వచ్చాడు. మరోవైపు వీసా సమస్యలతో ఇబ్బంది పడిన యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీతో పాటు జో రూట్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఎంతో స్పెషల్
ఇదిలా ఉంటే రాజ్‌కోట్ టెస్టు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఎంతో స్పెషల్ కానుంది. తన కెరీర్‌లో స్టోక్స్ 100వ టెస్టు ఆడనున్నాడు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టులో గెలిచి సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Illegal Assets Case : శివబాలకృష్ణ డ్రైవర్, అటెండర్ అరెస్ట్.. వారి పేరిట కళ్లుచెదిరే ఆస్తులు
ఇంగ్లండ్ తుది జట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.