IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్
ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే.
- Author : Maheswara Rao Nadella
Date : 08-04-2023 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
IPLT20 2023 DRS (Dhoni Review System) : ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఈ విధానాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నది మాత్రం మహీనే. తన కెరీర్ లో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. ధోనీ రివ్యూ కోరిన 99 శాతం వరకూ సరైన ఫలితాలే వచ్చాయి. తాజాగా ఇది మరోసారి రుజువైంది. కూల్ కెప్టెన్ గా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీని మించిన వారు లేరనేది వాస్తవం.
తాజాగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై ధోనీ రివ్యూపై ప్రశంసలు కురుస్తున్నాయి. ధోని మరోసారి తన మాస్టర్‌మైండ్ పవర్ ఏంటో రుజువు చేసుకున్నాడు. మిచెల్ సాంట్నర్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతి వైడ్ బాల్ అనే ఉద్దేశంతో సూర్య వదిలేశాడు.అయితే వికెట్ల వెనుక ధోని షార్ప్‌గా స్పందించి బంతి అందుకుని క్యాచ్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. అయితే గ్లోవ్స్‌కు తగిలి వెళ్లినట్లు అనిపించడంతో సూర్య కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వడంతో సూర్య ఆగిపోయాడు.
వెంటనే ధోని క్యాచ్ కోసం రివ్యూ కోరాడు.రిప్లేలో బంతి గ్లోవ్స్‌కు తగిలినట్లు తేలింది. దీంతో సూర్యకు నిరాశ తప్పలేదు. ఇక ధోని రివ్యూ తీసుకోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. డీఆర్‌ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో భారీస్కోర్ సాధిస్తుందనుకున్న ముంబైని చెన్నై బౌలర్లు 157 పరుగులకే కట్టడి చేసారు.
Also Read: Delhi vs Rajasthan: మూడోసారి ఓడిన ఢిల్లీ.. వార్నర్ కష్టం వృధా