HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Delhi Vs Railways Delhi Win By An Innings And 19 Runs

Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్‌ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!

వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు వికెట్ ఇచ్చాడు. అయితే ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యం సాధించింది.

  • Author : Gopi Date : 01-02-2025 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi vs Railways
Delhi vs Railways

Delhi vs Railways: రంజీ క్రికెట్‌లో రైల్వేస్‌పై (Delhi vs Railways) ఆయుష్ బడోని నేతృత్వంలోని ఢిల్లీ జట్టు మూడో రోజునే విజయం సాధించింది. రెండో రోజు మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రైల్వేస్ మొదట చేసి 241 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ జట్టు కెప్టెన్ బడోని 99 పరుగులు, సుమిత్ మాథుర్ 86 పరుగులతో జ‌ట్టు 374 పరుగులు చేసింది.

వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు వికెట్ ఇచ్చాడు. అయితే ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యం సాధించింది. రైల్వేస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 114 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ తరఫున శివమ్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

Also Read: PAN Card: పాన్ కార్డు వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. ఇలా చేస్తే రూ. 10 వేల జ‌రిమానా

సుమిత్ మాథుర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు

సుమిత్ మాథుర్ తన ఆల్ రౌండ్ ప్రదర్శన తర్వాత న్యూ ఢిల్లీలోని కిక్కిరిసిన అరుణ్ జైట్లీ స్టేడియం ముందు రైల్వేస్ జ‌ట్టుని ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. 27 ఏళ్ల మాథుర్ రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి వికెట్ తీయలేకపోయాడు. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో అతను మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో 86 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు.

రైల్వేస్ రెండో ఇన్నింగ్స్ 114 పరుగుల వద్ద ముగిసింది

రైల్వేస్ రెండో ఇన్నింగ్స్ 30.5 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ శివమ్ శర్మ 11 ఓవర్లలో నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను రైల్వేస్‌లో సూరజ్ అహుజా, వివేక్ సింగ్, మహ్మద్ సైఫ్, కర్ణ్ శర్మ, రాహుల్ శర్మల వికెట్లు తీశాడు. ఢిల్లీ బౌలర్లలో శివమ్‌తో పాటు నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ, మణి గ్రేవాల్, కెప్టెన్ బదోనీలకు ఒక్కో వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో విజయం నమోదు చేయడం ద్వారా ఢిల్లీ ప్రస్తుతం 21 పాయింట్లతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండు గెలిచింది. రెండు ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Delhi vs Railways
  • Domestic Cricket
  • Railways
  • Ranji Cricket
  • sports news
  • virat kohli

Related News

ACB raids

ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజ‌నింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క

    Latest News

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd