MS Dhoni: ఆర్సీబీపై రికార్డు సృష్టించేందుకు సిక్సర్ దూరంలో ఉన్న కెప్టెన్ కూల్!
ఇంకా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కూడా ధోనీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో 81.50 సగటతో 489 పరుగులు చేశాడు.
- By Gopichand Published Date - 05:48 PM, Sat - 3 May 25

MS Dhoni: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్లేఆఫ్ రేస్ నుంచి బయటకు పోయింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్లేఆఫ్ రేస్‌లో ఉంది. ఆర్‌సీబీ పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి చాలా కీలకం. అయితే సీఎస్‌కే తమ పరువును కాపాడుకోవడానికి ఈ మ్యాచ్‌లో ఆడుతుంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఒక పెద్ద రికార్డును తన పేరిట నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ రికార్డుకు ధోనీ కేవలం ఒక సిక్సర్ దూరంలో ఉన్నాడు.
చరిత్ర సృష్టించనున్న కెప్టెన్ కూల్
ఎంఎస్ ధోనీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అతను ఇప్పటివరకు ఆర్‌సీబీపై 34 మ్యాచ్‌లు ఆడాడు. 40.64 సగటుతో 894 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను నాలుగు సార్లు అర్ధసెంచరీలు సాధించాడు. మొత్తం 49 సిక్సర్లు కొట్టాడు. ఒకవేళ ధోనీ తదుపరి మ్యాచ్‌లో మరో సిక్సర్ కొడితే ఆర్‌సీబీపై ఐపీఎల్‌లో 50 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఆర్‌సీబీపై అత్యధిక సిక్సర్లు డేవిడ్ వార్నర్ కొట్టాడు. అతని పేరిట 55 సిక్సర్లు ఉన్నాయి. అయితే ధోనీ 49 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read: MLAs Progress Report: సీఎం రేవంత్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. వాట్స్ నెక్ట్స్ ?
ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
- డేవిడ్ వార్నర్- 55 సిక్సర్లు
- ఎంఎస్ ధోనీ- 49 సిక్సర్లు
- కేఎల్ రాహుల్- 43 సిక్సర్లు
- ఆండ్రే రస్సెల్- 38 సిక్సర్లు
- రోహిత్ శర్మ- 38 సిక్సర్లు
ఇంకా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కూడా ధోనీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో 81.50 సగటతో 489 పరుగులు చేశాడు. ఒకవేళ ధోనీ ఈ మైదానంలో మరో 11 పరుగులు చేస్తే ఇక్కడ 500 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఎంఎస్ ధోనీ పెద్దగా ఆకట్టుకోలేదు. అతను ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 25.17 సగటతో 151 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కానీ, అర్ధసెంచరీ కానీ రాలేదు. అతను 148.04 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ధోనీ 12 ఫోర్లతో పాటు 9 సిక్సర్లు సాధించాడు.