CSK vs DC: హోం గ్రౌండ్‌లో చిత్తు చిత్తుగా ఓడిన సీఎస్కే.. ఓటమికి ధోనీ కారణమా?
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 11వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 26 బంతుల్లో 30 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ధోనీ ఆటతో చెన్నైకి గుర్తుండిపోయే విజయాన్ని అందిస్తాడని అందరూ ఆశించారు.
- By Gopichand Published Date - 07:59 PM, Sat - 5 April 25

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను (CSK vs DC) 25 పరుగుల తేడాతో ఓడించింది. IPL 2025లో ఢిల్లీ విజయ హ్యాట్రిక్ సాధించగా, CSK వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట ఆడి 183 పరుగులు చేసింది. దానికి బదులుగా చెన్నై జట్టు 158 పరుగులకే ఆలౌట్ అయింది. విజయ్ శంకర్ 69 పరుగులతో అర్ధసెంచరీ సాధించినప్పటికీ.. అతని నీరసమైన స్ట్రైక్ రేట్ చెన్నై జట్టుకు భారీ నష్టం కలిగించింది.
విజయ్ శంకర్ స్ట్రైక్ రేట్ CSK ఓటమికి ప్రధాన కారణం?
చెన్నై సూపర్ కింగ్స్‌కు 184 పరుగుల లక్ష్యం లభించింది. దానికి బదులుగా హోం గ్రౌండ్‌లో ఆడిన CSK ఆరంభం చాలా దారుణంగా ఉంది. రచిన్ రవీంద్ర 3 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు, డెవాన్ కాన్వే 13 పరుగులతో ఔటయ్యారు. చెన్నై 41 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితిలో నాల్గవ స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 69 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతని స్ట్రైక్ రేట్ కేవలం 127.78గా నమోదైంది.
184 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పుడు విజయ్ శంకర్ వేగంగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా, అతను తన ఫిఫ్టీని పూర్తి చేయడానికే 43 బంతులు తీసుకున్నాడు. చివరి 5 ఓవర్లలో చెన్నైకి గెలవడానికి 78 పరుగులు అవసరమయ్యాయి. శంకర్ సెట్ అయి ఉన్నందున పెద్ద షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో అతను బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోయాడు.
Also Read: Chinas No 2 Missing : చైనాలో నంబర్ 2 మాయం.. జిన్‌పింగ్ సన్నిహితుడికి ఏమైంది ?
ఢిల్లీ హ్యాట్రిక్ సాధించింది
ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించి IPL 2025లో విజయ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఢిల్లీ ఇంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌ను 1 వికెట్‌తో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్లతో ఓడించి, ఇప్పుడు CSKను 25 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ IPL 2025ను ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల విజయంతో ప్రారంభించినప్పటికీ.. ఆ తర్వాత RCB, రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటములు చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 11వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 26 బంతుల్లో 30 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ధోనీ ఆటతో చెన్నైకి గుర్తుండిపోయే విజయాన్ని అందిస్తాడని అందరూ ఆశించారు. కానీ అతని 115.38 స్ట్రైక్ రేట్ కూడా చెన్నై ఓటమికి పెద్ద కారణమైంది.