Chris Woakes: ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. యాషెస్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం?!
'టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం.. క్రిస్ వోక్స్ 2025-26లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
- Author : Gopichand
Date : 02-08-2025 - 11:23 IST
Published By : Hashtagu Telugu Desk
Chris Woakes: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) గాయపడ్డాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. దీంతో అతను మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ గాయం కారణంగా వోక్స్ ఐదవ టెస్ట్ మ్యాచ్‌ను పూర్తిగా ఆడలేకపోవచ్చని సమాచారం. వోక్స్ బ్యాటింగ్‌కు రాలేదు. రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడానికి కూడా మైదానంలోకి రాలేదు.
యాషెస్ సిరీస్‌కు వోక్స్ దూరం?
‘టెలిగ్రాఫ్’ నివేదిక ప్రకారం.. క్రిస్ వోక్స్ 2025-26లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్‌లలో ఒకడైన వోక్స్ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం ఇంగ్లాండ్ జట్టుకు ఒక పెద్ద లోటు. ఇది ఆస్ట్రేలియాకు అనుకూలమైన వార్తగా పరిగణించవచ్చు.
Also Read: US Tariff: భారతదేశంపై 25 శాతం సుంకం స్టార్ట్.. ఈ రంగంపై భారీ ఎఫెక్ట్!
ఐదవ టెస్ట్‌లో ఇంగ్లాండ్ ప్రదర్శన
ఐదవ టెస్ట్‌లో క్రిస్ వోక్స్ లేకపోవడం ఇంగ్లాండ్‌ను పెద్దగా ప్రభావితం చేయలేదు. మొదటి రోజు వోక్స్ గాయపడినప్పటికీ రెండవ రోజు ఇంగ్లీష్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా గస్ ఆట్కిన్సన్ అద్భుతమైన బౌలింగ్ చేసి భారత్‌ను 224 పరుగులకు కట్టడి చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లాండ్ టీమ్ ఇండియా రెండు కీలక వికెట్లు తీసింది.
2025-26 యాషెస్ సిరీస్ షెడ్యూల్
ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ సిరీస్ నవంబర్ 21, 2025 నుండి జనవరి 8, 2026 వరకు జరుగుతుంది. మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది.
- మొదటి టెస్ట్: నవంబర్ 21–25, 2025, పెర్త్ స్టేడియం.
- రెండవ టెస్ట్: డిసెంబర్ 4–8, 2025, ది గబ్బా, బ్రిస్బేన్.
- మూడవ టెస్ట్: డిసెంబర్ 17–21, 2025, అడిలైడ్ ఓవల్.
- నాల్గవ టెస్ట్: డిసెంబర్ 26–30, 2025, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్.
- ఐదవ టెస్ట్: జనవరి 4–8, 2026, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.