Chris Gayle: ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్.. తెలంగాణ టీమ్ కెప్టెన్ గా క్రిస్ గేల్..!
తెలంగాణ టీమ్ ను యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) లీడ్ చేయనున్నాడు. ఈ మేరకు తెలంగాణ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
- Author : Gopichand
Date : 09-02-2024 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
Chris Gayle: ఐపీఎల్ తరహాలో ఎన్నో లీగ్ లు అభిమానులను అలరిస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వా త కూడా పలువురు ఆటగాళ్ళు విదేశీ లీగ్స్ లో సందడి చేస్తున్నారు. అయితే వెటరన్ ప్లేయర్స్ కోసం కొత్త లీగ్ షురూ కాబోతోంది. ఐపీఎల్ లానే అలనాటి క్రికెటర్లతో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ఐవీపీఎల్ ఫిబ్రవరి చివరి వారంలో మొదలుకానుంది. ఇప్పటికే ముంబై జట్టు కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికవగా.. తెలంగాణ టీమ్ ను యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) లీడ్ చేయనున్నాడు. ఈ మేరకు తెలంగాణ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
ఈ టోర్నీలో ఆడేందుకు.. భారత అభిమానులను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గేల్ తెలిపాడు. ఐవీపీఎల్ కోసం సిద్దంగా ఉండండి… ఓల్డ్ ఈజ్ గోల్డ్అని చెప్పుకొచ్చాడు. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీతో పాటు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. బోర్డ్ ఫర్ వెటరెన్ క్రికెట్ ఇన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఐవీపీఎల్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు డెహ్రాడూన్ వేదికగా జరగనుంది. క్రిస్ గేల్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడనున్నారు.
We’re now on WhatsApp : Click to Join