HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Chennai Vs Mumbai Will Dhoni And Rohit Make A Comeback

IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 2:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma x MS Dhoni at Chepauk
Rohit Sharma x MS Dhoni at Chepauk

ఐపీఎల్ 2026లో ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ధోనీ మాత్రం జట్టులోకి రావడం లేదు. ధోనీని గ్రౌండ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

సీఎస్కే మ్యాచ్ రోజు ఎంఎస్ ధోనీ ఎంట్రీ ఇస్తున్నాడా లేదా అనే విషయం రాత్రి 7 గంటల వరకు అభిమానులను టెన్షన్ పెడుతూనే ఉంటుంది. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోనీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడటం, మ్యాచ్ టైమ్‌కి నిరాశ పడటం ఇదే జరుగుతుంది. అయితే, ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని గట్టిగా వినిపిస్తుంది.

ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించవచ్చు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ధోనీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జట్టులో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ధోనీ ప్లేయింగ్ 11లో ఉంటే కార్తీక్ శర్మను పక్కనబెట్టే అవకాశం ఉంది. లేకపోతే ధోనీనే ప్లేయింగ్ 11లో ఆడతాడు.

ధోనీ మార్పుతో పాటు ప్రశాంత్ వీర్ లేకపోతే అకేలా హోసెన్ ఇద్దరిలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. అకేలా హోసెన్ వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాణించడంతో అకేలా హోసెన్‌నే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా జట్టులో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ మ్యాచ్‌లోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముకేశ్ చౌదరిని పక్కనబెడితే స్పెన్సర్ జాన్సన్‌తో బౌలింగ్ చేయించవచ్చు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు మాత్రమే గెలిచింది. మూడింటిలో ఒకటి ముంబై మీద ఉంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనా

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ / ఎంఎస్ ధోనీ, జెమీ ఓవర్టన్, ప్రశాంత్ వీర్ / అకేలా హోసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ / ముకేశ్ చౌదరి, గుర్‌జపనీత్ సింగ్.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chepauk Stadium
  • CSK
  • CSK vs MI
  • IPL2026
  • ms dhoni
  • mumbai indians
  • rohit sharma

Related News

2007, 2024, 2026 MS Dhoni, Suryakumar Yadav and Rohit Sharma together T20 world cup capitans

T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

టీమిండియాకు మూడు టీ 20 వరల్డ్‌కప్ టైటిళ్లను అందించిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ముగ్గురు లెజెండరీ కెప్టెన్లు తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ముగ్గురూ ఫొటో దిగారు. సూర్యకుమార్ యాదవ్‌ను మధ్యలో ఉంచి ధోనీ, రోహి

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • Chinnaswamy Stadium

    IPL : చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం..ఏంజరిగిందంటే !!

  • Anushka Sharma Watch

    IPL : వామ్మో.. అనుష్క శర్మ లగ్జరీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

  • Raghuvanshi

    IPL 2026 : KKR బ్యాటర్ రఘువంశీకి భారీ జరిమానా

Latest News

  • 10th Result : ఒక్క మార్కుతో ఫెయిల్.. ఏపీలో 10 తరగతి విద్యార్థిని సూసైడ్

  • Tamil Nadu Exit Poll Results : ఎలక్షన్స్ రిజల్ట్స్ వేళ త్రిష పోస్ట్ వైరల్

  • Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ పై ఐటీ శాఖ ఫోకస్

  • TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

  • Gas Price : స్టార్ హోటళ్లను తాకిన గ్యాస్ మంట.. భారీగా పెరగనున్న ధరలు!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd