IND vs BAN: టీమిండియా- బంగ్లా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? పిచ్ రిపోర్టు ఇదే!
వన్డే క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్‌ల రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీం ఇండియా 32 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
- By Gopichand Published Date - 11:04 AM, Thu - 20 February 25

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన కివీ జట్టు టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది. ఇదే సమయంలో భారత జట్టు నేటి నుండి తన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇప్పుడు దుబాయ్ వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్‌కి టాస్ ఏ సమయానికి పడుతుంది? పాకిస్థాన్‌తో పోలిస్తే దుబాయ్‌లో మ్యాచ్‌లు వేరే సమయంలో జరుగుతాయా అనే దాని గురించి తెలుసుకుందాం.
ఈరోజు దుబాయ్‌లో టాస్ ఏ సమయానికి వేస్తారు?
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ పాక్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌కి సంబంధించి టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరగగా, 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు టాస్ భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగగా, మ్యాచ్ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే మ్యాచ్ టైమింగ్ లో ఎలాంటి మార్పులేదు.
Also Read: Indian Elections Vs Trump : బైడెన్ రూ.182 కోట్లు.. భారత్‌లో ఎవర్నో గెలిపించాలనుకున్నారు : ట్రంప్
దుబాయ్ గ్రౌండ్ రికార్డు ఎలా ఉంది?
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 58 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్టు 34 మ్యాచ్‌లు గెలవగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 22 మ్యాచ్‌లు గెలిచింది. 2018లో హాంకాంగ్‌పై భారత్ చేసిన 287 పరుగులే ఈ మైదానంలో టీమ్ ఇండియా అత్యుత్తమ స్కోరు.
వన్డే క్రికెట్‌లో భారత్‌దే పైచేయి
వన్డే క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్‌ల రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీం ఇండియా 32 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ స్వదేశంలో భారత్‌తో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది.
పిచ్ రిపోర్ట్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించవచ్చు. మీడియా కథనాల ప్రకారం.. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం తాజా పిచ్‌ను ఉపయోగించనున్నారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకారం అందిస్తోందనే వాదన వినిపిస్తోంది. భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని తన ప్లేయింగ్ ఎలెవన్‌ని టీమిండిమా ఎంపిక చేసుకుంటుంది. దుబాయ్ పిచ్‌పై డ్యూ కీలక పాత్ర పోషించనుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ కూడా కీలకం కానుంది.
దుబాయ్ వాతావరణం గురించి మాట్లాడుకుంటే.. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో వర్షాలు కురిసే అవకాశం తక్కువ. మధ్యాహ్నానికి వర్షం పడే అవకాశం 55 శాతం ఉంది. అయితే మ్యాచ్ సమయంలో చాలా తక్కువగా ఉంది. మ్యాచ్ సమయంలో అడపాదడపా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పగటిపూట 27 డిగ్రీల సెల్సియస్, సాయంత్రం 20 డిగ్రీల వరకు ఉండనుంది.