Nitish Reddy Pushpa Celebration: అర్ధ సెంచరీని పుష్ప లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా బ్యాటర్!
రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా, మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
- By Gopichand Published Date - 10:00 AM, Sat - 28 December 24

Nitish Reddy Pushpa Celebration: భారత జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Reddy Pushpa Celebration) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో తన కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. యాభై పూర్తయిన తర్వాత నితీష్ పుష్ప స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కంగారూ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆఫ్ సైడ్‌లో అద్భుతమైన డ్రైవ్ కొట్టడం ద్వారా 21 ఏళ్ల ఆటగాడు తన టెస్ట్ ఫిఫ్టీని సాధించాడు.
ఇప్పటి వరకు నితీష్ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతనికి ఇదే తొలి టెస్టు హాఫ్ సెంచరీ. రిషబ్ పంత్ అవుటైన తర్వాత విశాఖపట్నం ఆటగాడు నితీష్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను వచ్చేసరికి భారత్ 191 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఫాలోఆన్ ప్రమాదంలో పడింది.
సుందర్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్
వాషింగ్టన్ సుందర్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేయడం ద్వారా అతను టీమిండియాను ఫాలో-ఆన్ నుండి రక్షించడమే కాకుండా అతని కెరీర్‌లో మొదటి యాభైని కూడా చేశాడు. ఇప్పటివరకు ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌లో 82 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ తర్వాత అతను రెండవ అత్యధిక స్కోరర్.
Also Read: ED Vs KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు
నితీష్ ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేశాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లోనే ఆస్ట్రేలియాపై నితీష్ కుమార్ రెడ్డి తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడని మనకు తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న అతను 41, 38 నాటౌట్‌లతో ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ వార్త రాసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ప్రస్తుతం వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి (85 నాటాట్), వాషింగ్టన్ సుందర్ (40 నాటాట్) పరుగులతో ఉన్నారు.
PUSPA IN BOX-OFFICE 🤝 NKR IN AUSTRALIA.
– Both are ruling…!!!!! pic.twitter.com/9poYVHMPlk
— Johns. (@CricCrazyJohns) December 28, 2024
నితీష్ రెడ్డి మూడో స్థానానికి చేరుకున్నారు
రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా, మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ వార్త రాసే వరకు ఈ 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ సిరీస్‌లో 60 సగటుతో, 70.38 స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేశాడు. 2017-18 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ తరఫున నితీష్ తొలిసారిగా ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 26 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 958 పరుగులు చేశాడు.