HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ben Duckett Slams Highest Score In Ct History

Ben Duckett: లాహోర్‌లో చరిత్ర సృష్టించిన బెన్ డకెట్.. చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్

డకెట్ కంటే ముందు ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియాపై అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. స‌చిన్ 1998 సంవత్సరంలో 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

  • Author : Gopichand Date : 22-02-2025 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ben Duckett
Ben Duckett

Ben Duckett: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 22న ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున బెన్ డకెట్ (Ben Duckett) అద్భుత ప్రదర్శన చేశాడు. సెంచరీ ఆడి గొప్ప ఘనత సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తరఫున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ప్లేయ‌ర్‌గా ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

డకెట్ రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా బెన్ డకెట్ నిలిచాడు. 2017లో ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ రికార్డును డ‌కెట్ బ‌ద్ధ‌లుకొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో డకెట్ 165 పరుగులతో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ మాత్రమే కాదు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్నింగ్స్‌ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డకెట్ ఇన్నింగ్స్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 165 పరుగులు చేశాడు.

Also Read: Toothpaste: ఏ వయస్సులో పిల్లలు టూత్‌పేస్ట్ వాడాలి?

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలైంది

డకెట్ కంటే ముందు ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియాపై అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. స‌చిన్ 1998 సంవత్సరంలో 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇప్పుడు డకెట్‌ మాస్టర్‌ బ్లాస్టర్ రికార్డును కూడా వెన‌క్కినెట్టాడు.

ఇంగ్లండ్ పటిష్ట బ్యాటింగ్ చూసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 7 మంది బౌలర్లను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. బెన్ ద్వార్షుయిస్ 10 ఓవర్లలో 66 పరుగులిచ్చి గరిష్టంగా 3 వికెట్లు తీసి జట్టులో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఆడమ్ జంపా, మార్నస్ లాబుషాగ్నే చెరో రెండు వికెట్లు తీయగా.. గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఒక వికెట్ తీశారు. నాథన్ ఎల్లిస్ తప్ప ఆస్ట్రేలియా బౌలర్లందరూ 6 కంటే ఎక్కువ ఎకానమీ రేట్‌తో పరుగులు ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ben Duckett
  • Champions Trophy 2025
  • ENG Vs AUS
  • England vs Australia
  • ICC Champions Trophy
  • Joe Root
  • sachin tendulkar

Related News

Arjun Tendulkar

పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

డీవై పాటిల్ టీ20 కప్‌లో అర్జున్ 'డీవై పాటిల్ బ్లూ' జట్టు తరపున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే శుక్రవారం (మార్చి 06) ముంబై కస్టమ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.

  • Nara.

    అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల ను ఆశీర్వదించిన లోకేశ్‌ దంపతులు

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd