Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ
Kohli-Gambhir interview: గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తన స్నేహ హస్తాన్ని చాచాడు. విరాట్ కూడా గంభీర్ గౌరవార్థం శ్రీలంక సిరీస్‌లో ఆడాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ మరో ముందడుగేసి గంభీర్, విరాట్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా ముగించింది.
- By Praveen Aluthuru Published Date - 02:08 PM, Wed - 18 September 24

Kohli-Gambhir interview: బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మరియు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నారు. కోచ్‌గా గౌతం గంభీర్‌కి ఇదే తొలి టెస్టు సిరీస్ కాగా, చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో అభిమానుల కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి. చెన్నైలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు బీసీసీఐ ఓ వీడియోను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గంభీర్ (Gambhir) , కోహ్లీ (Kohli) ఇద్దరూ గొప్ప క్రికెటర్లే. ఇద్దరూ తమ కెరీర్‌లో చాలా సాధించారు. ఇద్దరికీ సొంత ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవల కారణంగా క్రికెట్ అభిమానులు వాళ్లపై భిన్నాభిప్రాయాలు చూపిస్తుంటారు. అలాంటి అభిమానులకు ఈ వీడియో కాస్త రిలాక్స్‌గా ఉండొచ్చు. వాస్తవానికి కోహ్లీ, గంభీర్ మధ్య గత పదేళ్లుగా ఆసక్తికర పోరు నడిచింది. 2013 ఐపీఎల్, 2023ఐపీఎల్ వాల్లిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మనందరికీ తెలుసు. తద్వారా ఈ స్టార్ క్రికెటర్లు కొన్నాళ్లు మనకు శత్రువులుగా కనిపించారు. అయితే టి20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఉన్నగొడవల కారణంగా జట్టు డిస్ట్రబ్ అవుతుందని అంతా భావించారు, అయితే గంభీర్ తన స్నేహ హస్తాన్ని చాచాడు.విరాట్ కూడా గంభీర్ గౌరవార్థం శ్రీలంక సిరీస్‌లో ఆడాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ మరో ముందడుగేసి గంభీర్, విరాట్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా ముగించింది.
A Very Special Interview 🙌
Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat.
You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy
— BCCI (@BCCI) September 18, 2024
బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో 19 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇద్దరు లెజెండరీ ప్లేయర్లు క్రికెట్ గురించి బోలెడు విషయాలు గుర్తు చేసుకున్నారు. 2011 ప్రాపంచక విజయం నుంచి ప్రస్తుత పరిణామాల వరకు వారిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే ఈ వీడియోలో ఓ విషయం హైలైట్ అయింది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడటం వల్ల మన ఏకాగ్రత దెబ్బతింటుందా అని గంభీర్‌ని విరాట్ అడిగాడు. సమాధానంగా గంభీర్ మాట్లాడుతూ.. మీరు నాకంటే ఎక్కువగా మైదానంలో గొడవ పడ్డారని, ఈ ప్రశ్నకు సమాధానం నాకంటే మీకే ఎక్కువ తెలుసని చెప్పాడు. దీంతో ఇద్దరూ పగలబడి నవ్వడం అందర్నీ ఆకట్టుకుంది.
Also Read: IND vs BAN Test: ఆందోళన కలిగిస్తున్న బంగ్లాపై రోహిత్ రికార్డులు