HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bcci Played A New Trick Last Attempt To Bring Virat Kohli Back From Retirement Know The Whole Matter

Virat Kohli: టెస్టుల్లోకి విరాట్ రీఎంట్రీ.. బీసీసీఐ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రోజు మే 12. అంత‌కంటే ఐదు రోజులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్-బాల్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికిన విష‌యం తెలిసిందే.

  • By Gopichand Published Date - 11:00 AM, Mon - 2 June 25
  • daily-hunt
Virat Kohli London House
Virat Kohli London House

Virat Kohli: విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రోజు మే 12. అంత‌కంటే ఐదు రోజులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్-బాల్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికిన విష‌యం తెలిసిందే. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమీపిస్తున్న సమయంలో విరాట్ రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచే విషయంగా నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ చైర్మన్ (IPL Chairman 2025) అరుణ్ సింగ్ ధూమల్ విరాట్‌ను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రత్యేకంగా కోరారు.

న్యూస్ ఏజెన్సీ PTIతో అరుణ్ సింగ్ ధూమల్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ తన మొదటి ఐపీఎల్ సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారని అన్నారు. ఆర్సీబీ ట్రోఫీ గెలిచినా స‌రే కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం కొనసాగించాలని ఆయన అభిప్రాయప‌డ్డారు.

విరాట్‌ను రిటైర్మెంట్ ఉపసంహరించుకోమని కోరారు

విరాట్ కోహ్లీని టెస్ట్ రిటైర్మెంట్ నుండి వెనక్కి తీసుకోమని కోరుతూ అరుణ్ ధూమల్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ‘‘దేశం మొత్తం విరాట్ కోహ్లీ ఆడటం కొనసాగించాలని కోరుకుంటోంది. నేను కూడా అతను టెస్ట్ రిటైర్మెంట్ నుండి వెనక్కి రావాలని ఆలోచించాలని కోరుకుంటున్నాను. అలాగే ఐపీఎల్ నుండి కూడా రిటైర్ కాకూడదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అతను క్రికెట్‌కు అతిపెద్ద అంబాసిడర్‌గా ఉన్నారు’’ అని ధూమల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే కొన్ని సోషల్ మీడియా కథనాల ప్రకారం జూన్ 3న జరగబోయే ఐపీఎల్ ఫైనల్‌లో ఒకవేళ ఆర్సీబీ కప్ కొడితే కోహ్లీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

అరుణ్ సింగ్ ధూమల్ గతంలో BCCI కోశాధికారిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయనకు BCCIతో సంబంధం లేదు. కానీ ఐపీఎల్‌ను BCCI నిర్వహిస్తుంది కాబట్టి సాంకేతికంగా అరుణ్ ధూమల్ ఇప్పటికీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.

Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?

రెండు ఫార్మాట్ల నుండి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ

భారత జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఐపీఎల్ 2025 మధ్యలో మే 12న విరాట్ టెస్ట్ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికి, క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. ఇప్పుడు అభిమానులు విరాట్‌ను ఐపీఎల్, వన్డే మ్యాచ్‌లలో మాత్రమే చూడగలరు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arun Dhumal
  • BCCI
  • IPL Chairman 2025
  • sports news
  • test cricket
  • virat kohli

Related News

Suryakumar Yadav

Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఈ టోర్నమెంట్‌లో అతడు అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిస్తే శుభ్‌మన్ గిల్ ఈ టోర్నమెంట్‌లో 7 మ్యాచ్‌లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు.

  • India vs Australia

    India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS

    IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • India Playing XI

    India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

Latest News

  • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

  • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

  • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

  • Wednesday: ప్రతీ బుధవారం విఘ్నేశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు! ‎

  • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd