HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavithas Another Key Statement What Is It

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?

తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్‌ నాయకులతో సమావేశమయ్యారు.

  • Author : Gopi Date : 01-06-2025 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha: తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్‌ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్‌ కన్వీనర్‌ గా బొల్లా శివశంకర్‌, కో ఆర్డినేటర్‌ గా ఆలకుంట హరి, అడ్వైజర్ గా గట్టు రామచందర్‌ రావు, మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఐక్య పోరాటాలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న బీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే వరకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, తెలంగాణలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడబలుక్కొని బీసీ బిల్లులను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

యూపీఎఫ్‌ కన్వీనర్‌ బొల్లా శివశంకర్‌ మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే ఐకైక లక్ష్యంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. పెంచిన రిజర్వేషన్లను అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయో ప్రజలకు విడమరిచి చెప్తామన్నారు. బీసీలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రిజర్వేషన్లను సాధించి తీరుతామన్నారు.

Also Read: YCP Criminal Ideology: వైసీపీ నేరపూరిత, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్న ఘటనలు ఇవే!

యూపీఎఫ్‌ కో కన్వీనర్లుగా ఆర్ వి మహేందర్, కోల శ్రీనివాస్, నరహరి, విజయేంద్ర సాగర్, మల్లేష్ గౌడ్, గొరిగే నరసింహ, గోవర్ధన్ యాదవ్, గుర్రం శ్రవణ్, టి నరేష్ కుమార్, డి కుమార స్వామి, ఏతరి మారయ్య, కే ప్రవీణ్, రాచమల్ల బాలకృష్ణ, మురళి కృష్ణ, సల్వా చారి, ఫరూక్, కే శ్రీనివాస్, స్రవంత్, రాజు, నాగరాజు, అఖిల్, పరమేశ్వరి, కే వెంకటేష్, అశోక్ రెడ్డి, మాధవ్, మేన గోపీ, జహంగీర్ పాషా, లక్ష్మణ్, నరసింహులు, వి యాదగిరి రావు, లక్ష్మీ నారాయణ, సత్యనారాయణ, గుంటి మంజుల, గీత గౌడ్, రమాదేవి, నిమ్మల నగేష్, కృష్ణమాచారి, తారా సింగ్, శైల, పర్వతాలు, కృష్ణ, టి కలపూర్ణ, శ్రీనివాస్, ఆంజనేయులు, షేక్ లతీఫా, సర్సింహ రాజు, గాదె సామయ్య, శివాజీ, చత్రి మంజుల సాగర్, జె లలితా జగన్ లను నియమించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLC
  • MLC Kavitha
  • telangana
  • TG Politics
  • United Phule Front

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd