HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Layoffs At Amazon Again Impact On Robotics Employees

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2026 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amazon Layoffs
Amazon Layoffs
Amazon layoffs  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వరుస లేఆఫ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో రెండు నెలల కాలంలో ఈ సంస్థ 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పుడే తెలిపింది. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తోంది. సుమారు 100 మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

అమెజాన్ గోదాముల్లో పనిని ఆటోమేషన్ చేయడానికి రోబోలను డిజైన్ చేసే టీమ్ ఉంటుంది. ఈ రోబోటిక్స్ టీమ్‌పై ఇప్పుడు ప్రభావం పడింది. ఎంతమందిని తొలగించారన్నది అమెజాన్ వెల్లడించనప్పటికీ, లేఆఫ్‌లను మాత్రం ధ్రువీకరించింది.

వేర్ హౌస్‌లో కార్మికులకు సహాయపడేందుకు రోబోటిక్ విభాగమైన బ్లూజే గత సంవత్సరం అక్టోబర్‌లో రోబోలను ప్రదర్శించింది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ జనవరిలో వీటి తయారీని నిలిపివేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో 14 వేల మందిని తొలగించిన అమెజాన్, ఈ ఏడాది జనవరిలో 16 వేల మందిపై వేటు వేసింది. కృత్రిమ మేధ (ఏఐ), ఖర్చుల తగ్గింపులో భాగంగా ఈ కొద్ది కాలంలో 30 వేల మంది ఉద్యోగులను తొలగించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • Amazon Layoffs
  • Amazon Robotics
  • Artificial Intelligence
  • Artificial Intelligence (AI)
  • Bluejay
  • Employees Layoffs
  • job cuts
  • Robotics

Related News

Amazon Fashion

Amazon : అక్షయ తృతీయ వేళ అమెజాన్ ఫ్యాషన్ సరికొత్త నిర్ణయం

కేవలం భౌతిక ఆభరణాలే కాకుండా, అమేజాన్ పే ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. యూపీఐ (UPI) ద్వారా జరిపే లావాదేవీలపై ప్రైమ్ సభ్యులకు 2%, ఇతరులకు 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే కల్యాణ్ జ్యువలర్స్, తనిష్క్ వంటి బ్రాండ్ల

  • Amazon

    Amazon : అమేజాన్ సమ్మర్ సేల్ – పిల్లల బొమ్మలు, ఆట వస్తువులపై 50% వరకు భారీ తగ్గింపు!

Latest News

  • Liver Diseases : భారత్‌లో విజృభిస్తున్న కాలేయ వ్యాధులు

  • Amazon AI Store : అందుబాటులోకి అమెజాన్ ‘AI స్టోర్’

  • Mahindra University : మహీంద్రా యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రారంభం

  • HMD : హెచ్ఎండీ బ్రాండ్ అంబాసిడర్‌గా రాఘవ్ జుయల్

  • Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd