IPL 2022: క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లో ఎవరిదో పై చేయి ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది.
- By Naresh Kumar Published Date - 11:39 AM, Thu - 21 April 22

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే గెలుపొంది, 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుండగా, ముంబై ఇండియన్స్ జట్టు 6 మ్యాచ్‌ల్లోకూడా ఓటమైచవిచూసి తొమ్మిదో స్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లోచెన్నై జట్టు.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలవ్వగా,ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయంపాలైంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటివరకూ 32 మ్యాచ్‌లలో తలపడగా ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్‌లలో గెలవగా.. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్‌ను ఒకసారి పరిశీలిస్తే ఋతురాజ్ గైక్వాడ్ , రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీతో చెన్నైచాలా బలంగా కనిపిస్తుంది. పవర్ ప్లేలో ఋతురాజ్ గైక్వాడ్ హిట్టింగ్‌తో ఎక్కువ పరుగులు రాబట్టడానికి కృషి చేస్తున్నాడు. అయితే వన్ డౌన్‌లో వస్తున్న మొయిన్ అలీ ఆశించినంతగా రాణించక పోవడం ఢిల్లీకి మైనస్‌గా మారింది. మిడిలార్డర్ ప్లేయర్లు అంబటి రాయుడు, శివమ్ దూబే రాణిస్తున్నారు. వీరికి తోడు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని కూడా విజృంభించాల్సిన అవసరముంది. బ్రేవో , మహేష్ తీక్షణ , ముకేశ్ చౌదరి గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. వీరితో పాటు క్రిస్ జోర్దాన్ కూడా సమర్థంగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులు భారీ స్కోర్ చేయడం కష్టమే అని చెప్పొచ్చు.
ఇక ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తున్నప్పటికీ…. బౌలింగ్‌లో మాత్రం అంతగా రాణించలేకపోతుంది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలమవుతున్నా.. మిడిలార్డర్ ఆటగాళ్లు బ్రెవిస్ , సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టుకు మంచి భాగస్వామ్యం అందించడంలో సఫలమవుతున్నారు. కిరాన్ పోల్లర్డ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెలసిన అవసరముంది. ఇక బౌలింగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, ఉనద్కత్ కు తోడుగా మరే ఇతర బౌలర్ రాణించడంలేదు. టైమల్ మిల్స్ , ఫేబియన్ అలెన్, ఎం అశ్విన్ ఫామ్ అందుకోవాల్సిన అవసరముంది. ఇక ఇరు జట్ల బలబలాలు, ఐపీఎల్ రికార్డుల ఆధారంగా ఈరోజు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఎక్కువ అవకాశాలుగా కనిపిస్తుంది.