IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం ప్రత్యేక అతిధులు
ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. దాదాపు మూడు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఇంకో మూడ్రోజుల్లో ముగియనుంది
- By Praveen Aluthuru Published Date - 04:19 PM, Thu - 25 May 23

IPL 2023 Final: ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. దాదాపు మూడు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఇంకో మూడ్రోజుల్లో ముగియనుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 28న ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంచి. ఇదే రోజున ఐపీఎల్ 2023 విజేత జట్టును ప్రకటిస్తారు. కాగా ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్రవేశించింది. మే 26న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఏర్పాట్లు షురూ చేసింది. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక అతిథులను పిలిచేందుకు ప్లాన్ చేస్తుంది. తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని దృవీకరించారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షులు ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌లో ఆసియా కప్ 2023 గురించి ప్రత్యేక అతిథులతో చర్చలు జరుపనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఈ సమయంలోనే ఆసియా కప్ భవిష్యత్తును కూడా నిర్ణయించనున్నారు.
The respective presidents of Bangladesh, Afghanistan & Sri Lanka Cricket Boards will grace the Tata IPL 2023 final to be held on May 28 at the Narendra Modi Stadium (in Ahmedabad, Gujarat). We will hold discussions with them for outlining the future course of action in relation… pic.twitter.com/tw4sRfjOCv
— ANI (@ANI) May 25, 2023
ఆసియా కప్ 2023కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జై షా భారత్‌ను పాకిస్తాన్‌లో పర్యటించడానికి అనుమతించడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ వేదికపై పాకిస్తాన్ మరియు భారత్ మధ్య నిరంతరం చర్చ జరుగుతోంది.
Read More: IPL Finals @Modi Stadium: మోదీ స్టేడియం ప్రత్యేకతలేంటో తెలుసా

Tags

Related News

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ కు వర్షం అడ్డంకి… మ్యాచ్ జరగకుంటే ఎవరిది టైటిల్ ?
అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా 7.30 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మరింత ఆలస్యం కానుంది.