HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bangladesh Spoke Openly On The T20 World Cup Controversy

కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.

  • Author : Gopi Date : 06-01-2026 - 6:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mustafizur Rahman
Mustafizur Rahman

T20 World Cup Controversy: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ యాజమాన్యం అతడిని జట్టు నుండి బయటకు పంపింది. అయితే ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇది కేవలం ఒక ఆటగాడికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దౌత్యపరమైన వివాదంగా మారింది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం

ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రతా పరమైన ముప్పు ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ మ్యాచులను భారత్ నుండి తరలించి పూర్తిగా శ్రీలంకలోనే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు

వివాదంపై BCB చైర్మన్ ఏమన్నారంటే?

టీ20 వరల్డ్ కప్ వేదికను మార్చాలనే డిమాండ్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమీనుల్ ఇస్లాం ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తమ జట్టు పర్యటించడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని, అందుకే ఈ వేదిక మార్పును కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో అత్యవసర సమావేశాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. మేము ఈ విషయంలో బీసీసీఐతో ఎలాంటి చర్చలు జరపము. నేరుగా ఐసీసీతోనే మాట్లాడతాము. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ అనేది ఐసీసీ టోర్నమెంట్, దాని నిర్వహణ బాధ్యత వారిదే అని అమీనుల్ ఇస్లాం స్పష్టం చేశారు.

ఈ వివాదం కారణంగా ఐసీసీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకపోతే, టోర్నమెంట్ షెడ్యూల్, వేదికల కేటాయింపులో మార్పులు చేయాల్సి రావచ్చు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి సీనియర్ ఆటగాడిని ఐపీఎల్ జట్టు నుండి తొలగించడం వెనుక ఉన్న కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఈ ఒక్క ఘటన ప్రపంచ క్రికెట్ రాజకీయాలను వేడెక్కించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • india
  • Mustafizur Rahman
  • sports news
  • T20 world cup
  • T20 World Cup Controversy

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd