Rishabh Pant: టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ల కింగ్‌గా మారిన రిషబ్ పంత్!
విశేషమేమిటంటే.. రిషబ్ పంత్ 2025లో ఒక్క టీ20 ఇంటర్నేషనల్ లేదా వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైనప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నాడు.
- By Gopichand Published Date - 01:02 PM, Sun - 20 July 25

Rishabh Pant: రిషబ్ పంత్.. టీమిండియా అత్యంత ఆకర్షణీయమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. అయినప్పటికీ IPL 2025 అతనికి పెద్దగా కలిసి రాలేదు. ఐపీఎల్ 2025లో పంత్ (Rishabh Pant) లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ కొత్త ప్రారంభం చేశాడు. అయితే, ఈ సీజన్‌లో పంత్ ఆటతీరు చాలా పేలవంగా ఉంది. అయితే పంత్ ఈ సంవత్సరంలోనే తన ప్రదర్శనలో మార్పులు చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరపున సిక్సర్ కింగ్‌గా నిరూపించుకున్నాడు.
IPL 2025లో పంత్ నిరాశపరిచాడు
IPL 2025లో రిషబ్ పంత్ లక్నో సూపర్ జయింట్స్ తరపున మొత్తం 14 మ్యాచ్‌లలో ఆడాడు. అతను జట్టు కెప్టెన్‌గా కనిపించాడు. అందువల్ల మంచి ప్రదర్శన చేయాలనే ఒత్తిడి అతనిపై ఉంది. ఐపీఎల్ 2025లో పంత్ కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 24.45గా ఉంది. ఈ సమయంలో పంత్ అత్యధిక స్కోరు 118 పరుగులు (నాటౌట్). IPLలో ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 16 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అయితే టెస్ట్ క్రికెట్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఆడుతూ సుదీర్ఘ ఫార్మాట్‌లో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు.
Also Read: Bumrah: నాల్గవ టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా? కీలక అప్డేట్!
Rishabh Pant's Sixes in 2025
20 sixes in 8 innings (Test)
16 sixes in 13 innings (IPL)So far, Pant has not played any ODI or T20I in 2025. 🤯 pic.twitter.com/aslwD6qUq2
— All Cricket Records (@Cric_records45) July 20, 2025
టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ల కింగ్‌గా మారిన పంత్
అయితే, ఐపీఎల్‌తో పోలిస్తే టెస్ట్ క్రికెట్‌లో పంత్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 2025లో ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో (8 ఇన్నింగ్స్‌లు) అతను ఏకంగా 20 సిక్సర్లు బాదాడు. ఇలా తక్కువ ఇన్నింగ్స్‌లలోనే ఎక్కువ సిక్సర్లు కొట్టి, టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇది పంత్ తన ఆట శైలిని మార్చుకుని, టెస్ట్ ఫార్మాట్‌లో మరింత దూకుడుగా ఆడుతున్నాడని స్పష్టం చేస్తుంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా పంత్
విశేషమేమిటంటే.. రిషబ్ పంత్ 2025లో ఒక్క టీ20 ఇంటర్నేషనల్ లేదా వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైనప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ప్రస్తుతం పోటీకి దూరంగా ఉన్నాడు. సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్‌లో పంత్‌కు చోటు దక్కినా, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటంతో అతనికి అవకాశం రాలేదు. త్వరలోనే పంత్ నీలి జెర్సీలో కూడా భారత్ తరఫున ఆడుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.