HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Babar Azam Breaks Rohit And Kohlis Record Becomes The Number 1 Run Scorer In T20s

Babar Azam : రోహిత్, కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20ల్లో నెంబర్ 1 రన్ స్కోరర్‌!

  • By Vamsi Chowdary Korata Published Date - 11:53 AM, Sat - 1 November 25
  • daily-hunt
Babar Azam Virat Rohit
Babar Azam Virat Rohit

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన బాబర్, 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, సైమ్ అయూబ్ 71 పరుగులతో రాణించాడు.

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ మరో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. బాబర్ 123 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 4,234 పరుగులు చేసి భారత దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. రోహిత్ 151 ఇన్నింగ్స్‌ల్లో 4,231 పరుగులు సాధించగా, విరాట్ 117 ఇన్నింగ్స్‌ల్లో 4,188 పరుగులు సాధించాడు.

దక్షిణాఫ్రికాతో లాహోర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబర్ 18 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ రోహిత్ రికార్డును అధిగమించాడు. పాకిస్తాన్ ఆ మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది.

బాబర్ ప్రస్తుతం 39.57 యావరేజ్‌తో కొనసాగుతుండగా, రోహిత్ 32.05, విరాట్ 48.69తో ఉన్నారు. స్ట్రయిక్‌రేట్ పరంగా రోహిత్ ముందంజలో ఉన్నప్పటికీ, బాబర్ స్థిరమైన ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనతను దక్షిణాఫ్రికా బౌలర్ డోనోవన్ ఫెరెయిరా బౌలింగ్‌లో ఒక సింగిల్ తీసి సాధించాడు.

ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఓటమి తర్వాత తీవ్ర విమర్శల నడుమ బాబర్‌ను తిరిగి జట్టులోకి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్, విరాట్ తమ కెరీర్‌కు వీడ్కోలు పలికినందున, బాబర్ ఆజామ్ రికార్డులన్నీ సొంతం చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్‌కు సమానంగా పోటీ ఇవ్వగల ఆటగాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రమే. బట్లర్ ఇప్పటివరకు 132 ఇన్నింగ్స్‌ల్లో 3,869 పరుగులు చేశాడు.

రెండో టీ 20లో పాకిస్తాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను 110 పరుగులకే ఆలౌట్ చేశాడు. అనంతరం సైమ్ అయూబ్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయం పాకిస్తాన్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1 – 1తో సమం చేసింది. ఫైనల్ మ్యాచ్‌ నవంబర్ 1న లాహోర్ స్టేడియంలో జరగనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • babar azam
  • Babar Azam Records
  • cricket news
  • Kohli- Rohit
  • Pakistan Cricket

Related News

CWC25

CWC 25: టీమిండియా అభిమానుల్లో టెన్ష‌న్ పెంచుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌ ఫొటో షూట్‌!

ఫొటోషూట్‌లో ఏ కెప్టెన్ అయితే ట్రోఫీకి కుడి వైపున నిలబడతారో ఆ జట్టు టైటిల్ పోరులో ఓటమిని చవిచూసింది. అందుకే ఫొటోలో హర్మన్‌ప్రీత్ కౌర్ కుడి వైపున నిలబడటాన్ని భారత జట్టు ఓటమికి సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు.

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

  • Rohit Sharma

    Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

  • Australia Cricketer

    Australia Cricketer: మృత్యువుతో పోరాడుతున్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌!

  • Taskin Ahmed

    Taskin Ahmed : సిక్సర్ బాదిన బంగ్లాదేశ్ ప్లేయర్.. అవుట్ ఇచ్చిన అంపైర్.. ఒక్కసారిగా షాక్!

Latest News

  • Jogi Ramesh Arrest : జోగి రమేష్ అరెస్ట్

  • ‎Weight Loss: ఫాస్ట్ గా ఈజీగా బరువు తగ్గాలి అంటే రాత్రి పూట ఇవి తినాల్సిందే!

  • ‎Fenugreek Water: ప్రతీ రోజు మెంతుల నీరు తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

  • ‎Friday Remedies: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. అయితే శుక్రవారం రోజు ఇలా చేస్తే కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు!

  • ‎Thursday Remedies: గురువారం రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. లక్ష్మి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

Trending News

    • Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

    • UPI Payments: పండుగ సీజన్‌లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!

    • KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

    • Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగ‌ల‌దా?

    • Gold- Silver: బంగారం, వెండి వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd