BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌కు బీసీసీఐ బంపరాఫర్.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్రమోషన్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా త్వరలో విడుదల కానుంది. ఈసారి టీం ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గ్రేడ్ B నుంచి గ్రేడ్ Aకి పదోన్నతి దాదాపు ఖాయమైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
- By Gopichand Published Date - 11:00 AM, Fri - 28 March 25

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా త్వరలో విడుదల కానుంది. ఈసారి టీం ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గ్రేడ్ B నుంచి గ్రేడ్ Aకి పదోన్నతి దాదాపు ఖాయమైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్చి 29న BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లతో ఈ విషయమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ పదోన్నతితో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను గ్రేడ్ A+లో నిలుపుకోవడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. అక్షర్ పటేల్ ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌లలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అతను 5 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 109 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శనలు అతని పదోన్నతికి బలమైన ఆధారంగా నిలిచాయి. గ్రేడ్ Aలో ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యాలు కొనసాగనుండగా, గ్రేడ్ Bలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్‌లతో అక్షర్ చేరనున్నాడు.
గ్రేడ్ Cలో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, సంజు సామ్సన్ వంటి యువ ఆటగాళ్లు కొనసాగుతున్నారు. అయితే, T20 నుంచి రిటైరైన సీనియర్ ఆటగాళ్ల గ్రేడ్ A+ స్థానం గురించి చర్చలు సాగుతున్నాయి. అక్షర్ పటేల్‌కు ఈ పదోన్నతి రావడం వల్ల అతని వార్షిక ఆదాయం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెరగనుంది. మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో, పురుష ఆటగాళ్ల కాంట్రాక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్షర్ పటేల్ ప్రదర్శన ఆధారంగా ఈ పదోన్నతి BCCI సెలెక్షన్ కమిటీకి అతని విలువను చాటుతోంది.
Also Read: Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ ఎక్కువగా తినకూడదా.. తింటే ఏమవుతుందో తెలుసా?
గతేడాది బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితా
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా.
గ్రేడ్ A: ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా.
గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.
గ్రేడ్ C: రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివం దుబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రసిద్ధ కృష్ణ, అవేష్ ఖాన్. రజత్ పాటిదార్.