HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Aus Vs Ind Australia Make Travis Head Call

AUS vs IND: రేప‌ట్నుంచి నాలుగో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్

గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత హెడ్‌కు గాయమైందని, నాలుగో టెస్టులో ఆడడం కాస్త కష్టమని చాలా రిపోర్టులు వచ్చాయి.

  • Author : Gopi Date : 25-12-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AUS vs IND
AUS vs IND

AUS vs IND: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (AUS vs IND) మధ్య నాలుగో మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా వెల్లడించింది. ఇందులో రెండు ప్రధాన మార్పులు కనిపించగా.. భారత్‌కు అతిపెద్ద శత్రువుగా పిలువబడే ఆటగాడు కూడా నాల్గవ టెస్టుకు ముందు పూర్తిగా ఫిట్‌గా మారాడు. ఇప్పుడు ఆ ఆసీస్ బ్యాట్స్‌మెన్ మెల్‌బోర్న్‌లో భారత బౌలర్లకు త‌ల‌నొప్పిగా మారేందుకు సిద్ధమయ్యాడు.

ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు

గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత హెడ్‌కు గాయమైందని, నాలుగో టెస్టులో ఆడడం కాస్త కష్టమని చాలా రిపోర్టులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: New Rules For Luggage: విమాన ప్ర‌యాణికులకు బిగ్ అల‌ర్ట్.. కొత్త ల‌గేజీ రూల్స్ ఇవే!

హెడ్ ​​గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. “ట్రావిస్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఆడతాడు. హెడ్ పూర్తిగా కోలుకున్నాడు. ట్రావిస్ గాయపడటం గురించి ఆందోళన లేదు. అతను పూర్తిగా ఫిట్‌గా ఆడతాడు ” అని క‌మిన్స్ ప్ర‌క‌టించాడు. ఈ సిరీస్‌లో హెడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్‌లో ఉండి ఆస్ట్రేలియా నుండి నిరంతరం పరుగులు చేస్తున్న ఏకైక బ్యాట్స్‌మెన్ హెడ్ మాత్రమే. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ ముందంజ‌లో ఉన్నాడు. అతను తన బ్యాట్‌తో 2 సెంచరీలు కూడా చేశాడు.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 మార్పులు

గబ్బా టెస్ట్ సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా దూర‌మ‌య్యాడు. జోష్ గాయం చాలా తీవ్రంగా ఉండ‌టంతో అతను మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో స్కాట్ బోలాండ్ ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాడు. ఇది కాకుండా నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో సామ్ కొన్‌స్టాస్‌ని చేర్చారు. ఇక‌పోతే రేప‌ట్నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య నాలుగో టెస్టు జ‌ర‌గ‌నుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • Border-Gavaskar Trophy
  • cricket
  • IND vs AUS
  • sports news
  • TeamIndia
  • Travis Head

Related News

Former PCB CEO Wasim Khan Quits ICC

ICC: ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్

ఐసీసీ జనరల్ మేనేజర్‌గా గత నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్, తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించిన ఆయన, తన పదవీ కాలం ముగియకుండానే వైదొలగడం గమనార్హం. వాసిమ్ ఖాన్ ఇంగ్లాండ్‌లో జన్మించి అక్కడే కౌంటీ క్రికెట్ ఆడారు. పాకిస్థాన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యంతో 2019 నుండి మూడ

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • Chris Gayle

    కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Jofra Archer

    షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

Latest News

  • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

  • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

  • కాబోయే భార్య‌తో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయ‌ర్‌!

  • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

  • ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Trending News

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd