HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Iran Issues High Alert Warning

అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

అయితే యుద్ధవిరామం పొడిగించినప్పటికీ చర్చల ప్రక్రియ మాత్రం అటకెక్కినట్లు కనిపిస్తోంది. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలలో పాల్గొనేందుకు టెహ్రాన్ ప్రస్తుతం సుముఖంగా లేదు.

  • Author : Gopi Date : 22-04-2026 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US-Iran Peace Talks
US-Iran Peace Talks

Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి శిఖర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు, వారి సైనిక కమాండర్లు వరుసగా చేస్తున్న బెదిరింపులపై ఇరాన్ సైన్యం ఘాటుగా స్పందించింది. ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగారి ఈ మేరకు ఒక కీలక హెచ్చరికను జారీ చేశారు.

క్షణాల్లో దాడులకు సిద్ధం: ఇరాన్ సైన్యం

ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ప్రకటన ప్రకారం.. ఇస్లామిక్ ఇరాన్‌పై ఏ చిన్నపాటి దురాక్రమణ జరిగినా ఊరుకోబోమని జోల్ఫాగారి స్పష్టం చేశారు. “మా దళాలు ఇప్పటికే ముందే నిర్ణయించుకున్న లక్ష్యాలపై గురిపెట్టాయి. ఏవైనా దాడులు జరిగితే తక్షణమే పూర్తి శక్తితో విరుచుకుపడతాం” అని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ (జయోనిస్ట్ పాలన)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “పిల్లల హంతకులకు గతంలో కంటే బలమైన పాఠం నేర్పుతాం” అని హెచ్చరించారు.

Also Read: ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

నిరవధికంగా యుద్ధవిరామం పొడిగింపు

మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ దౌత్యపరమైన ముందడుగు పడింది. పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఇరాన్‌తో యుద్ధవిరామాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు. ఇరాన్ నుండి ఒక సమగ్రమైన శాంతి ప్రతిపాదన వస్తుందని అమెరికా ఆశిస్తోంది.

చర్చలపై నీలినీడలు

అయితే యుద్ధవిరామం పొడిగించినప్పటికీ చర్చల ప్రక్రియ మాత్రం అటకెక్కినట్లు కనిపిస్తోంది. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలలో పాల్గొనేందుకు టెహ్రాన్ ప్రస్తుతం సుముఖంగా లేదు. ఇరాన్ విముఖత వ్యక్తం చేయడంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ తన పాకిస్థాన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇరాన్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు చర్చలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని పాక్ సమాచార శాఖ వెల్లడించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Indefinite Ceasefire
  • Iran
  • Iran Policy
  • Iran US tensions
  • IRGC Warning
  • Israel-Iran Conflict

Related News

Countdown to a major war? Iran warns of 'Zero Hour'… US prepares to send fighter jets to Israel.

Donald Trump: పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌కు యుద్ధ విమానాలను పంపేందుకు అమెరికా సన్నద్ధం

పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక, ఇజ్రాయెల్‌కు విమానాల మోహరింపునకు అమెరికా సన్నద్ధం ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, అణు సంబంధిత కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఒక విస్తృత సైనిక చర్యను యోచిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదిత మోహరింపు జరిగింది. ఇరాన్‌పై సైనిక చర్యలను గణనీయంగా విస్తరించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్

  • We will make you face hell... Iran's warning to Gulf nations.

    Iran warning: నరకం చూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

Latest News

  • Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

  • Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

  • KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd