Team India: ఆసియా కప్ 2025.. టీమిండియా ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడనుందా??
ఆసియా కప్ 2025లో టైటిల్ గెలవడానికి టీమిండియాను బలమైన పోటీదారుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలుచుకుంది.
- By Gopichand Published Date - 12:15 PM, Fri - 19 September 25

Team India: యూఏఈలో ఆసియా కప్ 2025 సందడి కొనసాగుతోంది. మొత్తం 8 జట్లలో 4 జట్లు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించగా మరో 4 జట్లు సూపర్ 4కు అర్హత సాధించాయి. సూపర్ 4కు అర్హత సాధించిన తొలి జట్టు టీమిండియా. గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా (Team India) ఈ టోర్నమెంట్‌లో ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడవచ్చు. ఇందులో నాలుగు మ్యాచ్‌లు ఖాయం కాగా, ఫైనల్‌కు వెళ్తే ఐదో మ్యాచ్ కూడా ఆడుతుంది. ఆ మ్యాచ్‌లు ఎప్పుడు, ఏ జట్లతో ఆడతాయో తెలుసుకుందాం.
టీమిండియా గ్రూప్ ఎలో పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లతో కలిసి ఉంది. ఈ గ్రూప్ నుంచి యూఏఈ, ఒమన్ జట్లు బయటకు వెళ్లగా.. పాకిస్థాన్-భారత్ జట్లు సూపర్ 4కు అర్హత సాధించాయి. భారత్ మొదట యూఏఈని, ఆ తర్వాత పాకిస్థాన్‌ను ఓడించి ఇప్పుడు గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అబుదాబిలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌తో కలిపి టీమిండియా ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడవచ్చు.
Also Read: Abortion: మహిళకు అబార్షన్ చేయించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?
టీమిండియా ఐదు మ్యాచ్‌లు ఎలా ఆడవచ్చు?
- సెప్టెంబర్ 19: టీమిండియా ఈ రోజు ఒమన్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడుతుంది.
- సెప్టెంబర్ 21: సూపర్-4లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది.
- సెప్టెంబర్ 24: పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది.
- సెప్టెంబర్ 26: సూపర్ 4లో చివరి మ్యాచ్‌ను శ్రీలంకతో దుబాయ్‌లో ఆడుతుంది.
- సెప్టెంబర్ 28: ఒకవేళ ఫైనల్‌కు వెళ్తే అదే దుబాయ్ మైదానంలో ఫైనల్ పోరులో తలపడుతుంది.
టీమిండియా టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారు
ఆసియా కప్ 2025లో టైటిల్ గెలవడానికి టీమిండియాను బలమైన పోటీదారుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలుచుకుంది. టీమిండియాకు పోటీ ఇవ్వగల జట్టు ఏదీ లేదు. కానీ సూపర్ 4లో మూడు గ్రూప్ మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక గట్టి పోటీ ఇవ్వవచ్చు. సెప్టెంబర్ 21న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ కూడా ఉత్కంఠగా ఉంటుందని భావిస్తున్నారు. భారత్ ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. ఇదివరకే 8 టైటిల్స్ గెలుచుకుంది. ఈసారి 9వసారి ట్రోఫీని గెలుచుకోవచ్చు.