Asia Cup 2025: యూఏఈపై భారత్ ఘన విజయం!
టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
- By Gopichand Published Date - 10:10 PM, Wed - 10 September 25

Asia Cup 2025: టీ20 ఆసియా కప్ 2025లో (Asia Cup 2025) భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి బదులుగా శుభ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ కలిసి కేవలం 27 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు.
బౌలింగ్‌లో టీమిండియా తరఫున కులదీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మరియు శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ విజయాన్ని సులభతరం చేశారు.
Also Read: Kishan Reddy : కిషన్ రెడ్డి ఇరికించిన రాజాసింగ్
టీ20 ఆసియా కప్‌లో అతిపెద్ద విజయం టీ20 ఆసియా కప్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటి. గతంలో 2016లో కూడా టీమిండియా యూఏఈపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల లక్ష్యాన్ని 61 బంతుల్లో ఛేదించింది. కానీ ఈసారి భారత జట్టు కేవలం 27 బంతుల్లోనే ఒక వికెట్ కోల్పోయి 58 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.
బౌలర్ల మెరుపులు
యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా కెప్టెన్ ముహమ్మద్ వసీం, అలీషాన్ షరాఫు కలిసి జట్టు స్కోరును 26 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. కేవలం 31 పరుగుల వ్యవధిలోనే యూఏఈ పది వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు 57 పరుగులకే ఆలౌట్ అయింది. కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు, శివమ్ దూబే మూడు వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించారు.
కేవలం 27 బంతుల్లోనే మ్యాచ్ ముగింపు
58 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభం ఇచ్చారు. అభిషేక్ 16 బంతుల్లో 30 పరుగులు చేయగా, గిల్ 9 బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 2 బంతులు ఆడి భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ వేగవంతమైన బ్యాటింగ్‌తో టీమిండియా కేవలం 27 బంతుల్లోనే మ్యాచ్‌ను గెలుచుకుంది.