అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు
- Author : Vamsi Chowdary Korata
Date : 02-01-2026 - 4:41 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌పై.. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించారు. భారత్ వంటి అగ్రశ్రేణి జట్లకు.. అసోసియేట్ దేశాలతో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం సరికాదని చెప్పారు. ఇలా చేయడం వల్ల టోర్నీపై ఆసక్తి తగ్గుందని చెప్పారు. అంతేకాకుండా వ్యూయస్షిప్ కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీసీ నిర్ణయాలు టోర్నీకి తీరని నష్టం కలిగిస్తాయని అశ్విన్ హెచ్చరించారు. కాగా, గ్రూప్ దశలో టీమిండియా.. నమీబియా, యూఎస్ వంటి జట్లతో ఆడనుంది.
- ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు
- ఐసీసీకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్
- అలా చేయడం వల్ల ఆసక్తి పోతుందన్న మాజీ స్పిన్నర్
ప్రతిష్టాత్మక ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గరపడుతోంది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. దాదాపు నెల రోజుల సమయం ఉండటంతో.. ఒక్కొక్కటిగా.. దేశాలన్నీ తమ జట్టులను ప్రకటిస్తున్నాయి. భారత్ కూడా ఇప్పటికే వరల్డ్ కప్ టీమ్ ప్రకటించింది. అన్ని దేశాలు వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వార్నింగ్ ఇచ్చాడు. ఐసీసీ అనాలోచిత నిర్ణయం కారణంగా టీ20 ప్రపంచ కప్ 2026కు తీరని నష్టం జరగుతుందన్నాడు. ఈసారి వరల్డ్ కప్ మెగా టోర్నీని ఎవరూ చూడరన్న అశ్విన్.. వ్యూయర్షిప్ కూడా దారుణంగా పడిపోతుందని జోస్యం చెప్పాడు.
అశ్విన్ విమర్శలకు కారణం ఏంటి?
తన యూట్యూబ్ ఛానెల్లో వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీపై విమర్శలు చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా మ్యాచ్‌లను.. అసోసియేట్ దేశాలతో షెడ్యూల్ చేయడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు. మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగి.. ఈ వరల్డ్ కప్‌పై క్రికెట్ అభిమానులు ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చాడు. “నేను పాఠశాలలో చదువుకునే సమయంలో వన్డే ప్రపంచకప్‌లు నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. మేము ప్రపంచకప్ కార్డ్స్ సేకరించి ఆడుకునేవాళ్లం. టోర్నీ షెడ్యూల్స్ ప్రింట్ తీసుకోవడం, న్యూస్ పేపర్ కట్టింగ్స్‌ను తీసి జాగ్రత్తగా దాచుకునేవాళ్లం. వరల్డ్ కప్ కోసం ఎంతో ఎదురు చూసేవాళ్లం. ఆ ఎదురుచూపుల వల్ల మ్యాచ్‌లపై మరింత ఆసక్తి పెరిగేది. భారత్‌కు.. యూఎస్, నమీబియాతో మ్యాచ్‌లు పెడితే ఎవరూ చూడరు” అని అశ్విన్ కుండ బద్దలుకొట్టాడు.
అంతేకాకుండా, ఐసీసీ టోర్మమెంట్లను తరచుగా నిర్వహించడంపై కూడా అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనివల్ల ప్రపంచ కప్‌లపై సాధారణంగా ఉండే ఆసక్తి తగ్గిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అగ్రశ్రేణి జట్లు, వర్ధమాన జట్లకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని.. ఒక ప్రధాన సమస్యగా అశ్విన్ పేర్కొన్నాడు. తొలి రౌండ్లో టీమిండియాకు.. చిన్న దేశాలతో జరిగే మ్యాచ్‌ల వల్ల.. టోర్నమెంట్ తన పోటీతత్వాన్ని కోల్పోతుందని అశ్విన్ చెప్పాడు.
భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ..
- ఫిబ్రవరి 7న.. భారత్ వర్సెస్ అమెరికా (వాంఖడే స్టేడియం, ముంబై)
- ఫిబ్రవరి 18న.. భారత్ వర్సెస్ నమీబియా (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)
- ఫిబ్రవర్ 15న.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ (ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో)
- ఫిబ్రవరి 18న.. భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ (నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్)