Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?
జియోహాట్‌స్టార్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి మ్యాచ్‌లో తనకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనప్పుడు, చాలా బోరింగ్‌గా అనిపించిందని తెలిపాడు.
- Author : Gopichand
Date : 11-12-2025 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
Arshdeep Singh: టీమ్ ఇండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అద్భుతమైన ప్రజాదరణ పొందాడు. అతని సరదా రీల్స్, తెర వెనుక వీడియోలు, తేలికపాటి వినోదభరితమైన కంటెంట్ అతన్ని లక్షలాది మంది అభిమానులకు ఇష్టమైన ఆటగాడిగా మార్చాయి. అయితే అర్ష్‌దీప్ తన యూట్యూబ్ ఛానెల్‌ను ఏ కారణం చేత ప్రారంభించాడో మీకు తెలుసా? ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఆ కారణం చాలా ఆసక్తికరంగా ఉంది.
డ్రాప్ అయ్యాడు.. కొత్త ప్రయాణం మొదలైంది
జియోహాట్‌స్టార్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి మ్యాచ్‌లో తనకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనప్పుడు, చాలా బోరింగ్‌గా అనిపించిందని తెలిపాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ల కారణంగా భారత్ టోర్నమెంట్ అంతా నలుగురు స్పిన్నర్లను ఆడించింది. దీనివల్ల అర్ష్‌దీప్‌కు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అర్ష్‌దీప్ ఇలా అన్నాడు. “నేను మొదటి మ్యాచ్ ఆడటం లేదని తెలిసినప్పుడు, రూంలో నాకు చాలా బోర్‌గా అనిపించింది. అప్పుడే నేను నా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాను. ఇది నాకు దాగి ఉన్న ఆశీర్వాదంలా మారింది” అని పేర్కొన్నాడు. “ఈ స్థాయిలో ఆడుతున్నందుకు మీరు ఒక్కోసారి కృతజ్ఞతతో ఉండాలి. అవకాశాలు వస్తాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే.. అవకాశం వచ్చినప్పుడు దానిని చేజార్చుకోకూడదు. నేను ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా సానుకూలతను వెతుకుతాను. ఈ ఆలోచనే ముందుకు సాగడానికి సహాయపడుతుంది” అని వివరించారు.
Also Read: E- Cigarette: లోక్‌సభలో ఈ-సిగరెట్ వివాదం.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణ!
వైరల్ అయిన విరాట్ కోహ్లీ రీల్
ఇటీవల విరాట్ కోహ్లీతో కలిసి చేసిన అతని రీల్ ఒకటి ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. ఈ రీల్‌కి 132 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియో కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు కొట్టిన తర్వాత మూడో సెంచరీని మిస్ చేసుకుని, 65 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగిన మ్యాచ్ తర్వాత చిత్రీకరించబడింది. అర్ష్‌దీప్ సరదాగా ఇలా అన్నాడు. “పాజీ, రన్స్ తక్కువయ్యాయి. లేకపోతే ఈ రోజు సెంచరీ ఖాయం” అన్నాడు. దీనికి కోహ్లీ వెంటనే సరదాగా ఇలా బదులిచ్చాడు. “నువ్వు టాస్ గెలిచినందుకు థ్యాంక్స్ చెప్పు, లేకపోతే మంచులో నీ పని కూడా ఖాయమైపోయేది” అని అన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో బాగా నచ్చింది.
సిరీస్‌లో కోహ్లీ అద్భుతం
సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో విరాట్ కోహ్లీ వరుసగా మూడో సెంచరీ చేయలేకపోయినా అతను 65 పరుగులతో అజేయంగా నిలిచి, మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై 1-0 ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అర్ష్‌దీప్ కూడా తన అవకాశం కోసం ఎదురుచూసి, అద్భుతమైన ప్రదర్శనతో టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు.