Aiden Markram: ఐసీసీ అరుదైన గౌరవాన్ని అందుకున్న సౌతాఫ్రికా ఆటగాడు!
ఐడెన్ మార్క్‌రమ్ ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 207 బంతుల్లో 136 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
- By Gopichand Published Date - 03:30 PM, Mon - 14 July 25

Aiden Markram: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున అనేకమంది ఆటగాళ్లు గొప్పగా రాణించారు. వీరిలో ఇద్దరు ఆటగాళ్లను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ చేసింది. ఈ రేసులో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా వెనుకబడ్డాడు. కానీ అతని సహచర ఆటగాడికి ఐసీసీ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.
ఆఫ్రికన్ ఆటగాడు ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు
జూన్ నెలలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడారు. ఇక్కడ వేగవంతమైన బౌలర్ కగిసో రబడా బంతితో విజృంభించగా, బ్యాట్‌తో ఎయిడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) సంచలనం సృష్టించాడు. ఈ కారణంగానే ఈ ఇద్దరు ఆటగాళ్లను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో శ్రీలంక బ్యాట్స్‌మన్ పతుమ్ నిస్సంక పేరు కూడా చేరింది. నిస్సంక, రబడాను ఓడించి.. ఎయిడెన్ మార్క్‌రమ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి తన జట్టును విజయపథంలో నడిపించాడు. అందుకే అతను ఈ రేసులో అభిమానుల అభిమాన ఆటగాడిగా నిలిచాడు.
🚨 AIDEN MARKRAM WON THE ICC PLAYER OF THE MONTH FOR JUNE 🚨
– The Star of WTC final….!!!! 🥇 pic.twitter.com/iaJij82wrH
— Johns. (@CricCrazyJohns) July 14, 2025
Also Read: Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్‌ను వదలని మహమ్మారి!
ఐడెన్ మార్క్‌రమ్ ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 207 బంతుల్లో 136 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతేకాకుండా అతను 2 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అతను తన దేశానికి చెందిన దిగ్గజ బౌలర్ కగిసో రబడా, శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సంకలను వెనక్కి నెట్టి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. మార్క్‌రమ్ శక్తివంతమైన ఇన్నింగ్స్ కారణంగా దక్షిణాఫ్రికా దశాబ్దాల నాటి ట్యాగ్‌ను కూడా తొలగించుకుంది. దక్షిణాఫ్రికాను ఐసీసీ టోర్నమెంట్లలో ‘చోకర్స్’ అని పిలిచేవారు.
ప్లేయర్ ఆఫ్ ది వుమెన్‌గా హేలీ మాథ్యూస్
మరోవైపు వెస్టిండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి నాల్గవసారి ఈ టైటిల్‌ను సాధించింది. హేలీ మాథ్యూస్ గతంలో నవంబర్ 2021, అక్టోబర్ 2023, ఏప్రిల్ 2024లో ఈ అవార్డును గెలుచుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన తాజ్మిన్ బ్రిట్స్, సహచరురాలు ఎఫీ ఫ్లెచర్‌ను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లే గార్డనర్ తర్వాత ఈ అవార్డును నాలుగుసార్లు గెలిచిన రెండో క్రీడాకారణిగా నిలిచింది.
వెస్టిండీస్ కెప్టెన్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌లలో 104 పరుగులు చేసింది. ఇందులో మూడో మ్యాచ్‌లో సాధించిన అర్ధసెంచరీ కూడా ఉంది. ఆమె ఈ సిరీస్‌లో నాలుగు వికెట్లు కూడా తీసింది. ఆ తర్వాత 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను గెలిచిన తర్వాత కూడా ఆమె అద్భుత ప్రదర్శన కొనసాగింది. ఆమె రెండు అర్ధసెంచరీలతో మొత్తం 147 పరుగులు, రెండు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైంది.