BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై పాక్‌తో ఆడే ప్రసక్తే లేదు!
ఇప్పటివరకు ఉగ్రవాద దాడుల కారణంగా కశ్మీర్‌లో శాంతి భంగమైంది. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకుల్లో భయం నెలకొంది.
- By Gopichand Published Date - 03:56 PM, Thu - 24 April 25

BCCI: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన సందేశాన్ని ఇచ్చింది. ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడదని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్‌లు చివరిసారిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. ఆ సమయంలో పాకిస్తాన్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్తాన్‌ను సందర్శించింది. ఆ సమయంలో టీమ్ ఇండియా ఆసియా కప్‌లో పాల్గొంది. అయితే భారత జట్టు 2005-06 తర్వాత ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్తాన్‌ను సందర్శించలేదు.
రాజీవ్ శుక్లా ఏమన్నారు?
ఇప్పటివరకు ఉగ్రవాద దాడుల కారణంగా కశ్మీర్‌లో శాంతి భంగమైంది. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకుల్లో భయం నెలకొంది. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. “మేం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడం. మేం బాధితులతో ఉన్నాం. ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం ఏం చెప్పినా మేం అదే చేస్తాం,” అని అన్నారు.
Also Read: Maoists Hunting: 300 మంది మావోయిస్టుల దిగ్బంధం.. 5వేల మందితో భారీ ఆపరేషన్
స్పోర్ట్స్ టక్‌తో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. “ప్రభుత్వ ఆదేశాల కారణంగా మేం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడం. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడం. అయిత, ఐసీసీ ఈవెంట్ జరిగినప్పుడు ఆడతాం. ఎందుకంటే అది ఐసీసీ వ్యవహారం. జరిగిన ఘటనలకు వారే కారణమని ఐసీసీకి కూడా తెలుసు అని ఆయన పేర్కొన్నారు.
బీసీసీఐ కార్యదర్శి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేశారు. పహల్గామ్‌లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడిలో నిరపరాధుల దుర్మరణం క్రికెట్ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. విచారంలో మునిగిపోయింది. బీసీసీఐ తరపున ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల ఆత్మల శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. వారి బాధ, దుఃఖాన్ని పంచుకుంటూ ఈ విషాద సమయంలో మేం వారితో నిలబడతామని చెప్పారు.