HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Abhishek Sharma Gurus Disciples Have The Upper Hand In T20

Abhishek Sharma: టీ20లో గురు శిష్యులదే పైచేయి!

అటు అభిషేక్ ఇన్నింగ్స్ పై యువీ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ద్వారా యువీని గుర్తు చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  • By Naresh Kumar Published Date - 12:33 PM, Thu - 23 January 25
  • daily-hunt
ICC T20 Rankings
ICC T20 Rankings

Abhishek Sharma: ఇంగ్లండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. భారత విజయానికి ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంతగా దోహదపడ్డాడో బౌలర్లు కూడా అంతే సహకారం అందించారు. తొలుత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును స్వల్ప స్కోరుకే కుప్పకూల్చగా, ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగాడు.

133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తరఫున అభిషేక్ శర్మ (Abhishek Sharma) 34 బంతుల్లో 79 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ లో అభిషేక్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విలయతాండవం చేశాడు. తద్వారా అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని కేవలం 20 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ కు ఈ అర్ధ సెంచరీ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్‌పై టి20లో ఒక భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీ ఇదే. అభిషేక్ శర్మ కంటే ముందు యువరాజ్ సింగ్ 2007 టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌పై వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించాడు.

Also Read: Death Threats : కపిల్ శర్మ సహా నలుగురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపు.. ఆ ఈమెయిల్‌లో ఏముంది ?

యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో కెఎల్ రాహుల్ పేరు మూడవ స్థానంలో ఉంది. 2018లో కేఎల్ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌పై 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు.నిజానికి యువరాజ్ సింగ్ ను అభిషేక్ శర్మ గురువుగా భావిస్తాడు. పంజాబ్‌కు చెందిన ఈ యువ బ్యాట్స్‌మన్‌కు యువరాజ్ సింగ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. దీంతో గురువు తగ్గ శిష్యుడిగా అభిషేక్ ను ప్రశంసిస్తున్నారు. అటు అభిషేక్ ఇన్నింగ్స్ పై యువీ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ద్వారా యువీని గుర్తు చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు తేలిపోయారు. స్పిన్నర్ల ధాటికి ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. కెప్టెన్ బట్లర్ అత్యధకంగా 68 పరుగులు చేశాడు. మిగతా ఏడుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారు. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకోగా, అక్షర్, హార్దిక్, అర్ష్‌దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 12.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek Sharma
  • cricket
  • IND vs ENG
  • sports news
  • yuvaraj singh

Related News

India vs Australia

India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జట్టు కోసం కేఎల్ రాహుల్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు.

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS

    IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

  • Shubman Gill

    Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • IND vs AUS

    IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

Latest News

  • ‎Rice: నెలరోజుల పాటు అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Constipation: ‎మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

  • ‎Lemon: కేవలం ఒక్క నిమ్మకాయతో బరువుతో పాటు బాణ లాంటి పొట్టి తగ్గించుకోండిలా!

  • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరిని పూజిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • ‎Karthika Masam: కార్తీకమాసం సోమవారం చేసే స్నానం, ఉపవాసం, దీప దానం ఎలాంటి ఫలితాలను అందిస్తాయో మీకు తెలుసా?

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd