Death Threats : కపిల్ శర్మ సహా నలుగురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపు.. ఆ ఈమెయిల్‌లో ఏముంది ?
“మేం మిమ్మల్ని బాగా పరిశీలిస్తున్నాం. మీ ప్రతీ యాక్టివిటీని ట్రాక్(Death Threats) చేస్తున్నాం.
- By Pasha Published Date - 12:02 PM, Thu - 23 January 25

Death Threats : బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు ఎంతకూ ఆగడం లేదు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో గతేడాది ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య జరిగినప్పటి నుంచి ఈ బెదిరింపులు మరింత పెరిగాయి. తాజాగా మరో నలుగురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు వచ్చాయి. గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సెలబ్రిటీలకు బెదిరింపులు రాగా.. ఈసారి పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయని గుర్తించారు. ప్రముఖ కమేడియన్ కపిల్ శర్మ, నటుడు రాజ్‌పాల్ యాదవ్, కొరియోగ్రఫర్ రెమో డిసౌజా, నటి,గాయకురాలు సుగంధా మిశ్రాలకు హత్య బెదిరింపులతో ఈమెయిల్ వచ్చింది. దీనిపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read :INCOIS Hyderabad : హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు జాతీయ పురస్కారం.. ఏమిటీ ఇన్‌కాయిస్ ?
బెదిరింపు ఈమెయిల్‌లో ఏముంది ?
“మేం మిమ్మల్ని బాగా పరిశీలిస్తున్నాం. మీ ప్రతీ యాక్టివిటీని ట్రాక్(Death Threats) చేస్తున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. అందుకే మీకు చెప్పాలని భావించాం. మేం పబ్లిసిటీ కోసమో, మిమ్మల్ని వేధించడం కోసమే ఈ ఈమెయిల్‌ను పంపలేదు. దయచేసి మా మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోమని చెప్పడానికే ఈ ఈమెయిల్ చేశాం. దీని గురించి బయట ఎవరికీ చెప్పకండి’’ అని హత్య బెదిరింపు ఈమెయిల్‌లో ప్రస్తావించారు. ఎనిమిది గంటల్లోగా రిప్లై ఇవ్వకుంటే వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ పరంగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ‘BISHNU’ అనే వ్యక్తి సంతకంతో ఈ ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read :Garlic Price : వెల్లుల్లి కిలో రూ.450.. ధర ఎందుకు పెరిగింది ? ఎప్పుడు తగ్గుతుంది ?
కపిల్ శర్మ, సల్మాన్ ఖాన్..
- ఈ బెదిరింపు ఈమెయిల్ 2024 డిసెంబరు 14న రాజ్‌పాల్ యాదవ్‌కు వచ్చింది. దీంతో ఆయన ముంబైలోని అంబోలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బెదిరింపు ఈమెయిల్‌ను ట్రేస్ చేయగా, పాకిస్తాన్‌లోని లొకేషన్‌ను చూపించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సంప్రదించే దిశగా ముంబై పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
- కపిల్ శర్మ, అతడి మొత్తం టీమ్‌ను హత్య చేస్తామని పేర్కొంటూ మరో ఈమెయిల్ కపిల్ శర్మకు వెళ్లినట్లు తెలిసింది. కపిల్ శర్మ షోను సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్నందుకు కపిల్ శర్మను టార్గెట్ చేశామని ఈమెయిల్‌లో ప్రస్తావించడం గమనార్హం.