HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >2 Ipl Team Can Target Andre Russell

Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ?!

SRH జట్టుకు లోయర్ ఆర్డర్‌లో పవర్-హిట్టర్, నమ్మకమైన ఫినిషర్ కొరత చాలా కాలంగా ఉంది. ఆండ్రీ రసెల్‌ను కొనుగోలు చేయడం ద్వారా SRH తమ బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చు.

  • Author : Gopichand Date : 18-11-2025 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andre Russell
Andre Russell

Andre Russell: IPL 2026 సీజన్‌కు ముందు నవంబర్ 15న వెలువడిన రిటెన్షన్ జాబితాలో ఒక అనూహ్య నిర్ణయం అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తమ విధ్వంసక ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను (Andre Russell) విడుదల చేసింది. 2014 నుంచి KKR జట్టులో కీలక సభ్యుడిగా, మ్యాచ్ విన్నర్‌గా కొనసాగిన రసెల్‌ను విడుదల చేయడం నిజంగా షాకింగ్‌గా మారింది. దీంతో ఈ విండీస్ పవర్-హౌస్ ఇప్పుడు రాబోయే వేలంలోకి రానున్నాడు.

ఆండ్రీ రసెల్ ఎలాంటి ఆల్‌రౌండరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను బ్యాట్‌తో క్రీజులో నిలబడితే బౌలర్లకు దడ పుట్టడం ఖాయం. మైదానం నలువైపులా సిక్సర్లు కొట్టగలిగే సామర్థ్యం అతని సొంతం. అంతేకాకుండా బంతితో కీలక సమయాల్లో వికెట్లు తీయగల సత్తా కూడా రసెల్‌కు ఉంది. గత సీజన్‌లో రసెల్ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. అతనిలోని నిరూపితమైన మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం, మెరుపు ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని ఇతర జట్లు అతనిని తమ జట్టులోకి తీసుకోవడానికి తీవ్రంగా పోటీ పడటం ఖాయం. మరోసారి రసెల్‌కు కోట్లలో ధర పలకడం ఖాయమని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

Also Read: Numerology : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు బంగారం బాగా అదృష్టం తీసుకొస్తుంది.. తెలుసా.!

రసెల్ కోసం పోరాడే ప్రధాన జట్లు

IPL 2026 వేలంలో ఆండ్రీ రసెల్‌ను దక్కించుకోవడానికి ప్రధానంగా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

CSK జట్టు నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి కీలక ఆల్‌రౌండర్లు వెళ్లిపోవడంతో మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఫినిషింగ్ బాధ్యతలు స్వీకరించేవారు ధోని మినహా ఎవరూ లేరు. ఈ పరిస్థితుల్లో ఆండ్రీ రసెల్ CSKకి అద్భుతమైన ఎంపిక. క్రీజులోకి వచ్చిన వెంటనే హిట్టింగ్ చేయగల రసెల్.. ధోనికి తోడుగా బ్రహ్మాండమైన ఫినిషర్‌గా ఉపయోగపడగలడు. ప్రస్తుతం CSK వద్ద రూ. 43.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. తమ జట్టులో ఉన్న బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రసెల్‌ను దక్కించుకోవడానికి CSK యాజమాన్యం గట్టి పట్టుదల చూపించవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

SRH జట్టుకు లోయర్ ఆర్డర్‌లో పవర్-హిట్టర్, నమ్మకమైన ఫినిషర్ కొరత చాలా కాలంగా ఉంది. ఆండ్రీ రసెల్‌ను కొనుగోలు చేయడం ద్వారా SRH తమ బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చు. రసెల్ చేరికతో వారి బ్యాటింగ్ ఆర్డర్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. SRH వద్ద ప్రస్తుతం రూ. 25.5 కోట్లు అందుబాటులో ఉన్నాయి. రసెల్ లాంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ కోసం వారు తమ బడ్జెట్‌ను లెక్క చేయకుండా పోరాడే అవకాశం ఉంది. వేలం పక్రియలో ఈ రెండు జట్ల మధ్య రసెల్‌ను దక్కించుకోవడానికి బిడ్డింగ్‌లో భీకర యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. రసెల్ ఏ జట్టులోకి వెళ్తాడనేది చూడాలంటే వేలం రోజు వరకు వేచి చూడాల్సిందే.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andre Russell
  • CSK
  • IPL 2026
  • KKR
  • sports news
  • SRH

Related News

JioHotstar

JioHotstar: జియోహాట్‌స్టార్ నుండి ఐసీసీకి భారీ షాక్!

ఐసీసీ ఆదాయంలో దాదాపు 80 శాతం భారతదేశం నుండే వస్తుంది. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌తో డీల్ రద్దు కావడం ఐసీసీని చాలా కష్టాల్లోకి నెట్టవచ్చు.

  • Alex Carey

    AUS vs ENG : అలెక్స్ క్యారీ మైండ్‌బ్లోయింగ్ కీపింగ్!

  • Virat Kohli- Gautam Gambhir

    Virat Kohli- Gautam Gambhir: కోహ్లీ, గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయా? వీడియో వైర‌ల్!

  • Palaash

    Palaash: స్మృతి మంధానాతో వివాహం రద్దుపై పలాష్ రియాక్ష‌న్ ఇదే.. క‌ష్టంగానే ఉందంటూ!!

  • Smriti Mandhana

    Smriti Mandhana: స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ వివాహం రద్దు!

Latest News

  • CM Revanth Reddy: తెలంగాణ ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు: సీఎం రేవంత్

  • Numerology: మాస్టర్ నంబర్స్ (11, 22, 33) అంటే ఏమిటి? మీ సంఖ్యను ఎలా లెక్కించాలి?

  • Telangana: తెలంగాణ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు!

  • Top Google Searches: గూగుల్ సెర్చ్ 2025.. భారత్‌లో వైభవ్ సూర్యవంశీ, పాకిస్తాన్‌లో అభిషేక్ శర్మ హవా!

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Trending News

    • CM Revanth Reddy: 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

    • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

    • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

    • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd