HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Gold Brings Good Luck To Those Born On These Dates Did You Know

Numerology : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు బంగారం బాగా అదృష్టం తీసుకొస్తుంది.. తెలుసా.!

  • Author : Vamsi Chowdary Korata Date : 18-11-2025 - 4:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Numerology
Numerology

బంగారం  అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా ఆడవాళ్లకు బంగారం అంటే విపరీతమైన ఇష్టం. ఇక మగవారికి బంగారం మంచి పెట్టుబడి, ఆదాయ వనరు. ఓవరాల్‌గా మనుషులకు, బంగారానికి మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బంగారం  వెండి  వంటి లోహాలపై బాగా ఆసక్తి చూపుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలో ఏ తేదీల్లో పుట్టిన వాళ్లకి బంగారం బాగా కలిసొస్తుందో చూద్దాం..

పుట్టిన తేదీ ఆధారంగా మనకు ఏ లోహం కలిసి వస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాగే బంగారం విషయంలో కూడా అందరికీ బాగా ఇష్టం ఉంటుంది. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వాళ్లకి మాత్రం బంగారం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుందని పండితులు చెబుతారు. వీళ్లు బంగారం  ధరించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా బంగారాన్ని గురువు  గ్రహంతో సంబంధం ఉన్న లోహంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వాళ్లకు బంగారం బాగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. వీళ్లు ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి ఉంటారు. వీళ్లు సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు బాగా కష్టపడి పనిచేసే లక్షణాలను కలిగి ఉంటారు. ఈ లక్షణమే వాళ్లను విజేతలుగా నిలబెడుతుంది. అయితే వీళ్లు మొండితనం, ఒంటరితనం, అసహనం వంటి సమస్యలతో కూడా పోరాడుతుంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి అధిపతి సూర్యుడు అని పండితులు చెబుతారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు బంగారం (Gold) బాగా కలిసొస్తుందట.

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురుడు . ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే మంచి క్రియేటివిటీ వీళ్ల సొంతం. అన్నింటికి మించి వీళ్లు ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు. వీళ్లు ఇతరులకు బాగా సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. వీళ్లకి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. ధనానికి లోటుండదు. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. గురువు అనుగ్రహం వల్ల వీళ్లకి బంగారంతో శుభ ఫలితాలు కలుగుతాయి.

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. ఈ కారణంగా వీళ్లు బాగా తెలివితేటలు కలిగి ఉంటారు. మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కలిగి ఉంటారు. అలాగే వీళ్ల ఆలోచనలు, స్వభావం సాహసోపేతంగా ఉంటాయి. వీళ్లు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతారు. వీళ్లు ఎప్పటికప్పుడు మార్పును కోరుకుంటారు. వీళ్లది బాగా ఆకర్షణీయమైన, శక్తివంతమైన వ్యక్తిత్వం. వీళ్లు వ్యాపార రంగంలో బాగా రాణించే స్వభావం కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు అతి విశ్వాసం వల్ల కొంత నష్టం జరుగుతుంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా బంగారం బాగా కలిసి వస్తుందట. బంగారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట.

పుట్టిన తేదీ ప్రకారం 1, 3, 5 మూల సంఖ్యగా కలిగిన వాళ్లు గురువారం లేదా ఆదివారం రోజు బంగారం కొనడం , ధరించడం శుభప్రదం. గురు పుష్య యోగం లేదా పుష్య నక్షత్రం రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందట. ప్రతి గురువారం రోజు శ్రీమహావిష్ణువు లేదా దత్తాత్రేయుడిని పూజిండచం, ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించడం, ఆరోజు పసుపు రంగు వస్తువలు ధరించడం, పసుపు రంగు పదార్థాలు, స్వీట్లు, శనగలు వంటివి దానం చేయడం మంచిది. అలాగే బంగారాన్ని ఉంగరం రూపంలో ధరిస్తే కుడి చేతి చూపుడు వేలుకి ధరించడం శుభప్రదం. ఎందుకంటే కుడి చేతి చూపుడు వేలు గురువు స్థానాన్ని సూచిస్తుంది. అలాగు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కనకధారా స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Astrologer
  • astrology
  • buy gold
  • buy Silver
  • gold
  • Jupiter
  • Lucky Numbers
  • Numerology

Related News

    Latest News

    • Iran Attack America : ఒకే ఒక్క స్ట్రైక్‌తో అమెరికా ను కుదేల్ చేసిన ఇరాన్

    • దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

    • ట్రంప్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్.. ఏకంగా 1.1 బిలియన్ డాలర్లు నష్టం

    • Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

    • Anganwadi Workers : ఏపీలోని అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్

    Trending News

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

      • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

      • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

      • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

      • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd