Andhra Pradesh: ఏపీలో ఓ ఘాతుకం.. తల్లి, ఇద్దరు కూతుర్ల పై సుత్తితో దాడి
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.
- Author : Gopichand
Date : 24-12-2022 - 11:41 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వెళ్లి సుత్తితో తల్లి, ఇద్దరు కూతుర్లపై దాడి చేసి ప్రేమోన్మాది బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తల్లీకూతుళ్లు, ప్రేమోన్మాదిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమోన్మాది పొట్టిలంక గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమోన్మాదిని మరో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Two municipal workers Dead: కారు బీభత్సం.. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి