Bhim Army Chief: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ను పరామర్శించిన రెజ్లర్లు
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ పై నిన్న బుధవారం దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.
- Author : Praveen Aluthuru
Date : 29-06-2023 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
Bhim Army Chief: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ పై నిన్న బుధవారం దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పొత్తికడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అతనిని హుటాహుటిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో తన కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఈ రోజు గురువారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ను రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా కలిసి పరామర్శించారు. ఈ ఇద్దరు రెజ్లర్లు భీమ్ ఆర్మీ చీఫ్‌ను ఆసుపత్రిలో కలుసుకుని అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
చంద్రశేఖర్ ను కలిసి పరామర్శించిన అనంతరం రెజ్లర్లు మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనకు వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌తో సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులుచంద్రశేఖర్ ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా కొంతకాలంగా రెజ్లర్లు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెజ్లర్ల పోరాటానికి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
Read More: CBN target : వైసీపీ బలంపై చంద్రబాబు గురి