CBN target : వైసీపీ బలంపై చంద్రబాబు గురి
రాజకీయ సమీకరణాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు (CBN target)మార్చుతుంటారు. గెలుపు దిశగా వ్యూహాలను రచించడంలో ఆయన దిట్ట.
- Author : CS Rao
Date : 29-06-2023 - 3:41 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయ సమీకరణాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు (CBN target)మార్చుతుంటారు. గెలుపు దిశగా వ్యూహాలను రచించడంలో ఆయన దిట్ట. ప్రస్తుతం వైసీపీ వెన్నుముఖగా ఉన్న దళితుల్ని ఆకర్షించడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది. దళిత మాదిగ మీటింగ్ లను నిర్వహించింది. అలాగే, బుధవారం రోజు దళిత మాల సమ్మేళనాన్ని పెట్టింది. ఆ సందర్భంగా వైసీపీ చేసిన 17 పథకాల రద్దును ప్రస్తావించింది. వాళ్లను ఆలోచింప చేసేలా దళితులకు జరిగిన అన్యాయం మీద డేటాను నాయకుల ముందుంచారు. దాన్ని చూసిన తరువాత దళిత నాయకులు సైతం విస్మయం చెందారని టీడీపీ భావిస్తోంది.
రాజకీయ సమీకరణాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు (CBN target)
తెలుగుదేశం పార్టీ వాస్తవ పత్రాన్ని గురువారం విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 10శాతం కూడా నెరవేర్చలేదని వాస్తవ పత్రాల్లో పొందుపరిచారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మోసపు లీలలు , వాస్తవ పత్రం అనే టైటిల్ తో టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. ప్రధానంగా ప్రత్యేకహోదా, సీపీఎస్ రద్దు, మద్య నిషేధంతో పాటు పలు హామీలను ఇచ్చారు. వాటిని అన్నింటినీ పొందుపరుస్తూ వాస్తవ పత్రాలను ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు (CBN target) విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. హామీల్లో 90శాతం నెరవేర్చలేదని టీడీపీ చెబుతోంది. కేవలం 10శాతం మాత్రమే అమలు చేసి జగన్మోహన్ రెడ్డి మడత తిప్పారని ఆరోపిస్తోంది.
మేనిఫెస్టోలోని 6 వజ్రాలను పరిచయడం చేయడానికి
గతంలో నియోకవర్గాల వారీగా చార్జిషీట్ లను ఎమ్మెల్యేలు, మంత్రుల మీద టీడీపీ విడుదల చేసింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున వైసీపీలో ఆందోళన మొదలైయింది. అంతేకాదు, చార్జిషీట్ల ఆధారంగా జరిగిన రచ్చ క్రమంలో కొందరు మంత్రులను ఇంటికి పంపారు. క్యాబినెట్ 2.0 కూడా అప్పుడే జరిగింది. అదే తరహాలో ఇప్పుడు నియోజకవర్గాల వారీగా చార్జిషీట్లను విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (CBN target) సిద్ధమయ్యారు. సామాజికవర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నష్టపోయిన అంశాలను శాస్త్రీయంగా ప్రచురించడానికి దిశానిర్దేశం చేశారు. దీంతో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేల దందాల వ్యవహారం ప్రజల్లో చర్చకు రానుంది.
Also Read : CBN Manifesto 2.0 : టీడీపీ మేనిఫెస్టో 2.0 సిద్ధం! ప్రచారానికి బస్సు యాత్ర!!
ప్రస్తుతం మినీ మేనిఫెస్టోలోని 6 వజ్రాలను పరిచయడం చేయడానికి బస్సు యాత్రలను కొనసాగిస్తోంది. రైతు, మహిళ, యువత, బీసీ, నిరుద్యోగులు, పేదలకు ఇచ్చిన హామీలను తెలియచేస్తూ స్థానిక లీడర్లతో బస్సు యాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 నియోజకవర్గాల్లో ఈ యాత్ర స్థానిక లీడర్లతో నిర్వహిస్తున్నారు. ఆశించిన స్పందన వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో దళిత, బీసీ, మహిళ, యువ సమ్మేళనాలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా నిర్వహించిన దళిత సమ్మేళనాలు సూపర్ సక్సెస్ అయ్యాయని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో తాడేపల్లి వర్గాల్లో మాత్రం ఆందోళన బయలుదేరింది. అందుకు నిదర్శనం వైసీపీలోని దళిత మంత్రులు మీడియా ముందుకొచ్చి చంద్రబాబు (CBN target) మీద విమర్శలు చేయడమే.
Also Read : CBN Kuppam : లక్ష మోజార్టీకి రూట్ మ్యాప్, చంద్రబాబు కుప్పం టూర్ జోష్