HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Unconventional Celebration Leads To Controversy Warangal

Viral News : తన అభిమాన నాయకుడి కోసం వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న కార్యకర్త

Viral News : ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగి అందరిలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. తన అభిమాన నేత జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో అతను మందుబాబులకు ఉచితంగా మద్యం బాటిళ్లు పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వేడుకల సారథి మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజ్.

  • By Kavya Krishna Published Date - 04:21 PM, Thu - 2 January 25
  • daily-hunt
Gopala Naveen Raj
Gopala Naveen Raj

Viral News : ఓరుగల్లులో ఓ కార్యకర్త తన అభిమాన నాయకుడి జన్మదినాన్ని వినూత్నంగా జరుపుకోవడం ఇప్పుడు నగరంలో ఆసక్తికర చర్చగా మారింది. ఈ ఘటన వరంగల్ నగరంలో జరిగి అందరిలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. తన అభిమాన నేత జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో అతను మందుబాబులకు ఉచితంగా మద్యం బాటిళ్లు పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వేడుకల సారథి మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజ్. బుధవారం నాడు ఆయన జన్మదిన వేడుకలు వరంగల్ నగరంలో న్యూ ఇయర్ రోజునే జరగడంతో వేడుకల ఉత్సాహం రెట్టింపు అయింది. జన్మదినానికి విశేష జనసమీకరణతో గ్రాండ్‌గా పార్టీ నిర్వహించారు. అయితే, అందరిలా కాకుండా ఒక అడుగు ముందుకేసి, ప్రత్యేకంగా మద్యం బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించారు.

Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో భాగంగా నవీన్ రాజ్ అనుచరులు “తెలంగాణ దావత్” పేరుతో మద్యం షాప్ వద్దకు మందుబాబులను పిలిచారు. అక్కడ వారికి క్వార్టర్ బాటిల్స్, ఆఫ్ బాటిల్స్ ఉచితంగా అందించి, తమ అభిమానాన్ని చూపించారు. ఇది మద్యం ప్రియులకు పండగ లాంటి రోజుగా మారింది. అయితే, ఈ చర్య పలు విమర్శలకు దారితీసింది. “వెర్రి వెయ్యి విధాలు” అన్నట్లు, ఈ చర్యపై ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ జన్మదిన వేడుకలలో మరో వివాదాస్పద అంశం భద్రకాళి అమ్మవారి ఆలయంలో చోటుచేసుకుంది. నవీన్ రాజ్‌కు ఎలాంటి అధికారిక పార్టీ పదవి లేకపోయినా, ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడంపై గతంలో జనాల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆలయ ప్రధాన ద్వారం ముందు భారీ క్రేన్ సహాయంతో భారీ గజమాల వేయించడం, ఈ చర్య కారణంగా ట్రాఫిక్ స్తంభించడం ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి.

మద్యం పంపిణీ , గజమాల వివాదం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయవేత్తలు, సామాన్యులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు సామాజిక బాధ్యతా రహితంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇది జనంలో మాత్రమే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవ్వడం గమనార్హం.

December Car Sales: భారీగా కార్లు కొనుగోలు చేసిన వాహ‌నదారులు.. నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhadrakali temple
  • Gopal Naveen Raj
  • Konda Surekha
  • Liquor Distribution
  • telangana politics
  • Unusual celebrations
  • warangal

Related News

Konda Surekha

Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Telangana Cabinet Meeting : తెలంగాణ రాజకీయ వర్గాల్లో మంత్రి కొండా సురేఖ గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది

  • Uttamkumar Reddy

    Deccan Cement Company : ఆ వివాదంతో నాకు సంబంధం లేదు – ఉత్తమ్

  • 'deccan Cement' Lands

    Deccan Cement : ‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

  • Konda Surekha

    Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

  • Susmitha

    Konda Susmita : మా ఫ్యామిలీపై రెడ్డి వర్గం కుట్ర.. సురేఖ కూతురు ఆరోపణలు

Latest News

  • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

  • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

  • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

  • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd