HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tomatoes Vehicle Robbed In Bengaluru

Tomatoes Vehicle Robbed : కారులో వచ్చి.. 2000 కిలోల టమాటాల లోడ్ లూటీ

Tomatoes Vehicle Robbed : టమాటా ధరల సంక్షోభం మరింత ముదురుతోంది. కూరగాయల మార్కెట్‌కు టమాటాలను రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని కొందరు లూటీ చేశారు. 

  • Author : Pasha Date : 10-07-2023 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tomatoes
Tomatoes vehicle robbed

Tomatoes Vehicle Robbed : టమాటా ధరల సంక్షోభం మరింత ముదురుతోంది.

టమాటాను కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు..

ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.150 దాకా ఉంది.. 

ఈనేపథ్యంలో కూరగాయల మార్కెట్‌కు టమాటాలను రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని కొందరు లూటీ చేశారు. 

టమాటాలన్నీ ఎత్తుకుపోయారు.. 

ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న చిక్కజాల ఏరియాలో చోటుచేసుకుంది. చిత్రదుర్గలోని హిరియూరు పట్టణం నుంచి కోలార్ సిటీలోని కూరగాయల మార్కెట్‌కు 2,000 కిలోల టమాటాలను తరలిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. జూలై 8న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక కిలో టమాటా ధర కర్ణాటకలో రూ.150 దాకా ఉంది.  ఈ లెక్కన 2000 కిలోల టమాటా కాస్ట్ రూ. 3లక్షలు అవుతుంది. ఈ టమాటాలను మార్కెట్ కు తరలిస్తున్న రైతు లబోదిబో అంటూ గుండెలు బాదుకుంటున్నాడు. ఈ లూటీ వల్ల తనకు 3 లక్షల లాస్  జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Also read : Mother Runs Car Over Daughter : బిడ్డపై నుంచి కారు నడిపిన తల్లి.. పసికందు మృతి

“ముగ్గురు దుండగులు కారులో వచ్చి.. టమాటాల లోడ్ తో వెళ్తున్న  మా వాహనాన్ని ఢీకొట్టారు. మా వాహనాన్ని ఆపేసి.. నాపై, వాహనం డ్రైవర్‌పై దాడి చేశారు. ఈక్రమంలో ముగ్గురు దుండగులు మా దగ్గర డబ్బులు కూడా డిమాండ్ చేశారు.. దీంతో కొంత డబ్బును వాళ్లకు ఆన్ లైన్ లో బదిలీ చేశాను..  అనంతరం టమాటాల లోడ్ ఉన్న మా వాహనాన్ని తీసుకొని(Tomatoes Vehicle Robbed).. మమ్మల్ని నడిరోడ్డుపై వదిలి వాళ్ళు పరారయ్యారు” అని బాధిత రైతు వివరించాడు. మరోవైపు పలుచోట్ల టమాటా తోటల్లోనూ  చోరీలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.  దీంతో రైతులు పొలాల్లో టెంట్లు వేసుకొని కూర్చొని మరీ టమాటా పంటకు కాపలా కాస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • karnataka
  • Tomato Crisis
  • tomatoes price
  • Tomatoes Vehicle Robbed

Related News

Jr. NTR Loses Cool

జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

ఆదివారం బెంగళూరులోని IMS సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • Wife Kills Husband

    Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

  • Sambar Fight

    Bengaluru : భార్య భర్తల మధ్య సాంబార్ గొడవ.. ఏకంగా ప్రాణాలు పోయేలా చేసింది

  • Karnataka to ban social media use for children under 16

    16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Latest News

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

  • హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

  • ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

  • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd