Mother Runs Car Over Daughter : బిడ్డపై నుంచి కారు నడిపిన తల్లి.. పసికందు మృతి
Mother Runs Car Over Daughter : ఆమె కారు నడుపుతూ అకస్మాత్తుగా దానిపై కంట్రోల్ కోల్పోయింది.
- Author : Pasha
Date : 10-07-2023 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
Mother Runs Car Over Daughter : ఆమె కారు నడుపుతూ అకస్మాత్తుగా దానిపై కంట్రోల్ కోల్పోయింది..
దీంతో అక్కడే ఆడుకుంటున్న ఆమె చిన్నారి కూతురిపైకి కారు దూసుకెళ్ళింది..
ఈ యాక్సిడెంట్ లో పాప తలకు తీవ్ర గాయమైంది..
ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ పాప చనిపోయింది..
13 నెలల పాప చనిపోయిన ఈ విషాద ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న యవపై కౌంటీలో చోటుచేసుకుంది. వాస్తవానికి ఆ తల్లి తన కూతురిని ఒక టాయ్ ట్రాలీలో కూర్చోబెట్టి .. తమ ఇంటి ఆవరణలో ఇరుకైన ప్రదేశంలో ఉన్న కారును వేరేచోట పెట్టేందుకు రెడీ అయింది. అంతలో జరగరానిది జరిగింది. కారును ముందుకు కదపడం ప్రారంభించే సరికి.. ఆ పాప ఆడుకుంటూ కారు దగ్గరికి వచ్చేసింది. కారును మరో చోట పెట్టేందుకు డ్రైవింగ్ స్టార్ట్ చేసిన ఆ తల్లికి .. ముందు టైరులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించింది. టైరుకు బలంగా ఏదో తడుతున్న ఫీలింగ్ కలిగింది.
Also read : Earthquake : భూకంపంతో వణుకు.. కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో అలర్ట్
దీంతో అదేంటో చూసేందుకు కారు దిగిన ఆమెకు చెమటలు పట్టాయి. బీపీ డౌన్ అయింది. టైరు కింద తన బిడ్డ నలిగిపోయి(Mother Runs Car Over Daughter) కనిపించింది. తన బిడ్డపైకి తానే కారును నడిపానా అని ఆమె ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. పాపను తీసుకెళ్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేసింది. అయినా పాప ప్రాణాలు నిలవలేదు. బాగా గాయాలపాలైన ఆ పాప చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచింది. పాప మరణానికి కారణమైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన ఈ పాప పేరు సైరా రోజ్ థోమింగ్.
Also read : 900 Crores To Girl Friend : గర్ల్ ఫ్రెండ్ కు 900 కోట్ల ఆస్తిని రాసిచ్చిన లీడర్