Pawan Kalyan: పవన్ కు పాదాభివందనం, నిర్మాతపై నెటిజన్స్ ఫైర్!
నిర్మాత యలమంచిలి రవిశంకర్ పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కడం షాక్ కు గురిచేసింది.
- Author : Balu J
Date : 14-06-2023 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన యాగానికి చాలా మంది నిర్మాతలు దర్శకులు కూడా హాజరై పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ సమయం లోనే అక్కడ ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ల లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన నిర్మాత యలమంచిలి రవిశంకర్ చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది.
పవన్ కల్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ రవిశంకర్.. పవర్ స్టార్ కాళ్లకు నమస్కారం చేశారు. ఈ వ్యవహారం పై అటు సినీ రంగం లోనూ ఇటు రాజకీయ పరంగానూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా దీని పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. నిర్మాత అయ్యి ఉండి .. ఇలా పవన్ కాళ్ళు మొక్కడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే పవన్ పై ఉన్న అభిమానం అలాంటింది అని కొందరు అంటుండగా.. మరికొందరు.. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని ఇంకొందరు అంటున్నారు. అయితే ఎదుటివాళ్ల మీద తమకు ఉన్న అభిమానం,ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపుతారు.. రవిశంకర్ అలా చూపెట్టారు.. అది ఆయన ఇష్టం.. పవన్ కాళ్లు మొక్కితే మీకేంటి ప్లాబ్లం అని మరికొందరు రవిశంకర్ ని సపోర్ట్ చేస్తున్నారు.
Also Read: Vande Bharat: ఒడిశా ఎఫెక్ట్.. త్వరలో 5 వందేభారత్ రైళ్లు ప్రారంభం!