HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Government Orders For Setting Up Hydra Police Station

Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.

  • Author : Latha Suma Date : 07-01-2025 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Government orders for setting up Hydra Police Station
Telangana Government orders for setting up Hydra Police Station

Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నగరంలోని బుద్ధ భవన్ బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. కాగా, హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.

ఇక, హైడ్రాను ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ప్రశ్నలు తలెత్తడంతో.. ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్‌ను చేర్చింది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు.. జలాశయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే..హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని మరోసారి హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, హుడాఎన్ క్లేవ్ కాలనీతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీల్లో హైడ్రా సిబ్బందితో కలిసి ఈరోజు ఏవీ రంగనాథ్ 2 గంటలపాటు పర్యటించారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు అంతకుముందు తెలిపారు. 2011లో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని స్థానికులు రంగనాథ్‌కు మొరపెట్టుకున్నారు. ఆక్రమణకు గురైన ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేటాయించిన స్థలంలో వారికి ఇళ్లు కట్టించే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. మొదట ఎకరం 25 గుంటలను ముందుగా రక్షిస్తామని అన్నారు.

Read Also: KTR Press Meet : నాకేమైనా ఉరిశిక్ష పడిందా..ఏంటి ఆ శున‌కానందం.? – KTR


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buddha Bhavan B-Block
  • hydra
  • Hydra Commissioner Ranganath
  • Hydra Police Station
  • Orders Issuance
  • telangana government

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd