Independence Day 2023: ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరిపించాలని భావిస్తున్నది. వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు
- By Praveen Aluthuru Published Date - 08:01 PM, Tue - 8 August 23

Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరిపించాలని భావిస్తున్నది. వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్మారకం వద్ద ఆర్మీ జీఓసీ అధికారులతో సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసులు, రోడ్లు, భవనాలు, సమాచార శాఖ, బల్దియా, విద్యుత్, రవాణా మరియు ఇతర విభాగాలు తగిన రీతిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి అని ఆమె తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తారని సీఎస్ తెలిపారు.
Also Read: Rohit Sharma Net Worth: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆదాయం ఎంతో తెలుసా..?