Team India: కష్టాల్లో భారత్.. 33 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన టీమిండియా..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ (Team India) బ్యాటింగ్ ఎంచుకుంది.
- Author : Gopichand
Date : 15-02-2024 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
Team India: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు రాజ్‌కోట్ వేదికగా మారింది. ఇందుకోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ (Team India) బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మొదట్లోనే జైస్వాల్ రూపంలో బిగ్ షాక్ తగిలింది. 10 బంతుల్లో 10 పరుగులు యశస్వి మార్క్ వుడ్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Also Read: ICC Rankings: ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ విడుదల.. మొదటి స్థానంలో అఫ్గాన్ ఆటగాడు..!
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ వెంటనే ఔటయ్యాడు. ఖాతా తెరవకుండానే మార్క్ వుడ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాటిదార్ కూడా 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీమిండియా 33 పరుగుల వద్దనే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (17 నాటౌట్), రవీంద్ర జడేజా (0) క్రీజులో ఉన్నారు. ఈ వార్త రాసే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది.
We’re now on WhatsApp : Click to Join