ICC Rankings: ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ విడుదల.. మొదటి స్థానంలో అఫ్గాన్ ఆటగాడు..!
అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ నిలకడగా అద్భుతమైన ఆటతీరుతో లాభపడ్డాడు. ICC తాజాగా ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ (ICC Rankings)ను ఫిబ్రవరి 14న బుధవారం విడుదల చేసింది.
- Author : Gopichand
Date : 15-02-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
ICC Rankings: అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ నిలకడగా అద్భుతమైన ఆటతీరుతో లాభపడ్డాడు. ICC తాజాగా ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ (ICC Rankings)ను ఫిబ్రవరి 14న బుధవారం విడుదల చేసింది. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ హల్ హసన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం నబీ 314 పాయింట్లతో ఉండగా, షకీబ్ 310 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.
శ్రీలంకపై బలమైన ప్రదర్శన
39 ఏళ్ల మహ్మద్ నబీ.. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో నబీ అద్భుత సెంచరీ ఆడాడు. నబీ 130 బంతులు ఎదుర్కొని 136 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. నబీ టాప్ పొజిషన్‌కు చేరుకోగానే తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు కూడా చేరింది. నిజానికి ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్న అత్యంత పెద్ద వయస్కుడి ఆటగాడిగా నబీ నిలిచాడు. అంతకుముందు ఈ ప్రత్యేక రికార్డు శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉంది. అతను 38 సంవత్సరాల 8 నెలల వయస్సులో ICC ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు.
షకీబ్‌కి షాక్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ హల్ హసన్ చాలా కాలంగా గాయంతో బాధపడుతున్నాడు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షకీబ్ హల్ హసన్ టోర్నీని మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతడికి కంటి సమస్యలు కూడా వచ్చాయి. దీంతో అతను చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ కూడా షకీబ్‌ను కెప్టెన్సీ పదవి నుండి బంగ్లాదేశ్ తొలగించిన విషయం తెలిసిందే. ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో షకీబ్ దాదాపు ఐదేళ్లపాటు మొదటి స్థానంలో ఉన్నాడు.
We’re now on WhatsApp : Click to Join
టాప్ 10లో ఒక్క భారతీయుడు
ఫిబ్రవరి 14, బుధవారం నాడు ICC తాజా ర్యాంకింగ్స్‌లో ఒక టీమిండియా ప్లేయర్ మాత్రమే టాప్ 10లో తన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. భారత జట్టు అత్యుత్తమ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 209 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా తన చివరి మ్యాచ్‌ను 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ తర్వాత అతను ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు.