Monkeypox : హిమాచల్ ప్రదేశ్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు..?
- Author : Prasad
Date : 30-07-2022 - 6:05 IST
Published By : Hashtagu Telugu Desk
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడింది. వ్యాధి నిర్ధారణ కోసం ఆ వ్యక్తి నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బద్ది ప్రాంతానికి చెందిన వ్యక్తికి 21 రోజుల క్రితం సంక్రమణ లక్షణాలు కనిపించాయి. అయితే అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ముందుజాగ్రత్త చర్యగా అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా ఉంచామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదని అధికారులు వెల్లడించారు. దేశంలో జులై 27 నాటికి మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి నాలుగు మంకీపాక్స్ కేసులు ధృవీకరించబడ్డాయి. కేరళ నుండి మూడు, ఢిల్లీ నుండి ఒకటి నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలియజేసింది.